AKP: నర్సీపట్నంలో సోమవారం బాలిక దినోత్సవ కార్యక్రమాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ వీర జ్యోతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీవో వీవీ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. బాలికల ఆరోగ్యం పట్ల అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అన్నమయ్య: రాయచోటి మదనపల్లి రింగ్ రోడ్‌పై సోమవారం తెల్లవారుజామున సీతాఫలాలతో లోడైన ఆటో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో రోడ్డుమధ్యలో పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రాయచోటి ట్రాఫిక్ సీఐ కుళాయప్ప వెంటనే స్పందించి, ఆటోను రోడ్డుమీద నుంచి తొలగించి రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
VZM: జిల్లా సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 30 పోలీసు చట్టంను అక్టోబర్ 30 నుంచి నవంబర్ నవంబర్ 11 వరకు అమలు చేస్తున్నామని ఇంఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు సోమవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖ అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు,సమావేశాలు నిర్వహించడం నిషేధమన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
SKLM: పాతపట్నం మహాత్మా గాంధీ జ్యోతి పూలే బీసీ వెల్ఫేర్ బాలికల కళాశాల ప్రిన్సిపల్‌గా సోమవారం అరుణ నాయుడు బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో శిక్షణ అనంతరం ఆమె మాట్లాడుతూ.. కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సార్వకోట మండల విద్యాశాఖ అధికారి మడ్డు రామినాయుడు, పాతపట్నం ఎంఈవో పలువురు పాల్గొన్నారు.
BPT: కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని ఓ కుటీర పరిశ్రమగా మార్చిందని YCP రేపల్లె సమన్వయకర్త డా. ఈవూరు గణేష్ అన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోమవారం నగరం మండలంలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనతరం ఎక్సైజ్ CI మార్టూరి శ్రీరామ ప్రసాద్‌కు వినతి పత్రం అందించారు. నకిలీ మద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ATP: నియోజకవర్గంలో బెల్ట్ షాపులు, కల్తీ మద్యం విక్రయాలు ఆపకపోతే మహిళా విభాగం ఆధ్వర్యంలో దాడులు చేస్తామని కళ్యాణదుర్గం YSRCP సమన్వయకర్త తలారి రంగయ్య హెచ్చరించారు. పేదల డబ్బు మద్యం ద్వారా తెలుగుదేశం నాయకుల జేబుల్లోకి వెళ్తుందని విమర్శించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ELR: చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం నుండి అమరావతి, ఎయిమ్స్ వరకు కొత్త బస్సు సర్వీసును మంత్రి కొలుసు పార్థసారథి ఏర్పాటు చేయించారు. ఈ సర్వీసు ద్వారా మహిళలకు ‘స్త్రీ శక్తి’ పథకం కింద ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిందన్నారు. సొసైటీ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు, నక్కారాము తదితరులు మంత్రి చిత్తశుద్ధిని కొనియాడారు.
GNTR: గుంటూరు BR స్టేడియంలో నూతన జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి (DSDO)గా పఠాన్ అఫ్రోజ్ ఖాన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లా క్రీడాకారులను అత్యున్నత నైపుణ్యంతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని, రాష్ట్ర, దేశ స్థాయిలో జిల్లాను నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. స్టేడియాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
PPM: అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలు విజేతలకు సోమవారం బహుమతులు అందజేశారు. పాలకొండ మండలం వెంకంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో రంగలక్ష్మి బహుమతులు ఇచ్చారు. వ్యాస రచనలో శ్రావణి, నిరోష, రాజ్యలక్ష్మి, రన్నింగ్‌లో చాందిని, ప్రీతి, షార్ట్ ఫుట్‌లో దుర్గా చాందిని, విజేతలుగా నిలిచారు.
ప్రకాశం: కంభం పట్టణంలోని పలు దుకాణాల్లో సోమవారం ఎంపీడీవో వీరభద్రాచారి ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంలో భాగంగా తగ్గిన నిత్యావసర వస్తువుల ధరలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జీఎస్టీ తగ్గింపుతో పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
అన్నమయ్య: మదనపల్లె నియోజకవర్గంలో వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలంటూ BYS ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఇవాళ నిరసన చేపట్టారు. అధ్యక్షుడు పునీత్ కుమార్ మాట్లాడుతూ.. రోడ్లన్నీ గుంతలమయం కావడంతో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. అనంతరం ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీవైఎస్ సభ్యులు పాల్గొన్నారు.
VSP: నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని పెందుర్తి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్ పిలుపుమేరకు పెందుర్తి ఎక్సైజ్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. కల్తీ మద్యం తయారీదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. బెల్ట్ షాపులను రద్దు చేయాలని తెలిపారు.
CTR: పుంగనూరు పురపాలక కార్యాలయ ఆవరణంలో సోమవారం మెప్మా బజారును ఏర్పాటు చేశారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి దీనిని ప్రారంభించారు. మహిళ సంఘ సభ్యులు సొంతంగా తయారు చేసిన బ్యాగులు, దుస్తులు ఇలా వివిధ రకాల తినుబండారాలను కమిషనర్ పరిశీలించారు. మహిళలు తమ చేతివృత్తుల ఉత్పత్తులను విక్రయించడానికి, ఆర్థికంగా ఎదగడానికి మెప్మా బజార్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.
NLR: ఆడపిల్లను రక్షించుకుందామని చాకలికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం DHEO కలసపాటి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈ నెల 11న ప్రపంచ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కలిగిరి కస్తూర్బా బాలికల పాఠశాలలోని బాలికలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆడ, మగ ఒకటేనని తెలియజేశారు.
కృష్ణా: సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బందరు బోనాంజా షాపింగ్ ఫెస్టివల్‌ను మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం ప్రారంభించారు. వారం రోజులపాటు నిర్వహించే ఈ ఫెస్టివల్‌లో వివిధ రకాల ఉత్పత్తులను విక్రయించనున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.