VSP: వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర పర్యటన సూపర్ సక్సెస్ అయిందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. సీపీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి సీపీ ‘ఎమ్మెల్యే’ అంటూ మాట్లాడటం సరికాదని, వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
VSP: వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర పర్యటన సూపర్ సక్సెస్ అయిందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. సీపీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి సీపీ ‘ఎమ్మెల్యే’ అంటూ మాట్లాడటం సరికాదని, వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
PPM: సీతంపేట గిరిజన గురుకుల బాలుర పాఠశాల నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జయకృష్ణ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈమేరకు మౌలిక వసతుల కల్పన నిమిత్తం రూ.167.50 లక్షల నిధులు మంజూరయ్యాని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఛైర్మన్ బి.సంధ్యారాణి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జి. నీలంనాయుడు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
VSP: విశాఖ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు శుక్రవారం 15 వినతులు వచ్చాయని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావు తెలిపారు. ప్రజల నుంచి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించేందుకు ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
AKP: రావికమతంలో కొత్తగా నిర్మించిన తులసి కళ్యాణ మండపాన్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ శుక్రవారం ప్రారంభించారు. విశాఖ డెయిరీ సహకారంతో దీనిని నిర్మించారు. ఈ ప్రాంత ప్రజల కోసం నిర్మించిన దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎస్ఎస్ రాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.
E.G: కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ, పింఛన్‌లకు సంబంధించిన 11 వినతులు వచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వినతులను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
VZM: వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల మానసిక స్థితి మెరుగు పడేలా పని చేయాలని బొబ్బిలి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం. రోహిణిరావు సూచించారు. శుక్రవారం స్దానిక CHCలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. రోగులకు మానసిక స్థైర్యం ఇచ్చేలా వైద్యం చేస్తే వ్యాధులు వేగంగా తగ్గుతాయన్నారు.
కృష్ణా: గుడివాడ మండలం మోటూరులోని అంబేద్కర్ గురుకులం పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాల నివారణ, శక్తి యాప్ వినియోగం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ విషయాలపై ఎస్సై చంటిబాబు అవగాహన కల్పించారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే పోలీసు సహాయం తీసుకోవాలని సూచించారు.
W.G: తాడేపల్లిగూడెం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాలబొమ్మల శ్రీనివాస్ నియమితులయ్యారు. భీమవరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ.శీలం, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మార్నీడి బాబ్జి చేతుల మీదుగా నియామక పత్రం అందుకోనున్నారు.
ప్రకాశం: తర్లుపాడు మండలం, తుమ్మలచెరువు గ్రామంలో శుక్రవారం ‘ఆత్మ’ సంస్థ సహకారంతో కంది పంటపై ఫాం స్కూల్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి, అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంమని మండల వ్యవసాయ అధికారిని జోష్నాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.
VSP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించనున్న ‘కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని’ విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆశీలమెట్ట కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
VSP: జననేత జగన్ విశాఖ పర్యటన సూపర్ సక్సెస్ అయిందని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పర్యటనలో ప్రజలు భారీగా తరలివచ్చి జననీరాజనాలు పలకడం కూటమి నేతల గుండెల్లో గుబులు పుట్టించిందని వ్యాఖ్యానించారు.
NLR: ముఖ్యమంత్రి చంద్రబాబు పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడని, రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతిగా నిలిచారని కావలి MLA కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆశల రూపకర్తగా, అభివృద్ధి శిల్పిగా టెక్నాలజీ రాష్ట్రానికి పునాది వేసిన నేతగా చంద్రబాబు నిలిచారన్నారు. CMగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా MLA హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేశారు.
W.G: భీమవరం సోమేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నపూర్ణ అమ్మవారికి 19.5కేజీల వెండి మకర తోరణం అందించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. సోమేశ్వరాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే అంజిబాబును కలిసి మకర తోరణ వివరాలను తెలిపారు. ఈనెల 12 ఉదయం 11.30 గంటలకు అమ్మవారికి మకర తోరణం అలంకరిస్తామన్నారు.
అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎన్‌సీసీ విభాగం డా.బి.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం “ఎన్‌సీసీ అవగాహన కార్యక్రమం” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఎన్‌సీసీ ఎంపిక విధానం, శిక్షణా ప్రక్రియ, సర్టిఫికెట్లు, భవిష్యత్తు అవకాశాలు గురించి విపులంగా శుక్రవారం వివరించారు. అనంతరం విద్యార్థులు క్రమశిక్షణ, దేశసేవ భావనలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.