• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మాచర్లలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

PLD: ముస్లిం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఆదివారం మాచర్ల జండా చెట్టు బజారులోని షాదీ ఖానాలో ముస్లింలకు ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు షేక్ జానీ సైదా విందులో పాల్గొని వడ్డించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మదార్ సాహెబ్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.

March 16, 2026 / 07:19 AM IST

ఏప్రిల్ 1 నుంచి పాలీసెట్‌కు ఉచిత కోచింగ్

కడప: 10వ తరగతి పరీక్షల అనంతరం నిర్వహించే పాలీసెట్, ఏపీ ఆర్ జేసీ-2066 ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్ తరగతులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతాయని టీచర్ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం పులివెందుల పాత సత్రం పాఠశాలలో కరపత్రాలను విడుదల చేసి ఆయన మాట్లాడారు. పట్టణంలోని పాత సత్రం పాఠశాలలోని విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.

March 16, 2026 / 07:19 AM IST

ఆదిత్యుని ఆదాయం రూ 6.65లక్షలు

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు ఆదివారం ప్రకటనలో వెల్లడించారు. టికెట్లు రూపేణ, విరాళాలు, ప్రసాదాలు రూపంలో రూ. 6.65లక్షలు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో KNV D ప్రసాద్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.

March 16, 2026 / 07:18 AM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ ఇన్‌ఛార్జ్

సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని జామియా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ధర్మవరం టీడీపీ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు అస్లాం నడిమ్ మసీద్, షామీర్ నడిమ్ మసీద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విందులో పట్టణంలోని ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 16, 2026 / 07:17 AM IST

నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం

ATP: విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ‘డయల్ యువర్ ఎస్ఈ’ నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కుంటున్న వారు 08554-272943 లేదా 9154790350 నంబర్లకు ఫోన్ చేసి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. వినియోగదారుల సేవలను మెరుగుపరచడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని వెల్లడించారు.

March 16, 2026 / 07:17 AM IST

పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్..!

E.G: నిడదవోలు మండలం కోరుమామిడి శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని సమిశ్రగూడెం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.5,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై బాలాజీ సుందరరావు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు సమాచారం ఇవ్వాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని SI హెచ్చరించారు.

March 16, 2026 / 07:17 AM IST

పది పరీక్షలకు సర్వం సిద్ధం : కలెక్టర్

కడప: నేడు జిల్లాలో జరగనున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు భయాందోళనలు వీడి ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు.

March 16, 2026 / 07:16 AM IST

నేడు కలెక్టరేట్‌లో పీజీర్స్ కార్యక్రమం

KKD: కలెక్టరేట్‌లో ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించనున్నట్లు కలెక్టర్ షాన్‌మోహన్ తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం 1100 నంబర్ ఉపయోగించాలని, రాలేని వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. అధికారులందరూ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తారన్నారు.

March 16, 2026 / 07:16 AM IST

నేడు యధావిధిగా కలెక్టరేట్‌లో PGRS: కలెక్టర్

కోనసీమ: అమలాపురం కలెక్టరేట్‌లో ఇవాళ ‘PGRS’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా ఆర్‌డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ప్రజలు తమ ఫిర్యాదులు అందజేయవచ్చని పేర్కొన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి నిర్ణీత సమయంలో పరిష్కరించుకోవాలని సూచించారు.

March 16, 2026 / 07:15 AM IST

కత్తితో తండ్రి దాడి.. ఇంటర్ విద్యార్థినికి గాయాలు

KRNL: కర్నూలు పాత కల్లూరులో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన మైనర్ కూతురిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న షేక్ సమీరాకు కుడిచేయి రెండు వేళ్లు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ నెల 17న జరగనున్న చివరి పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడిందని విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.

March 16, 2026 / 07:08 AM IST

చిల్డ్రన్ హోమ్ తనిఖీ చేసిన కలెక్టర్

AKP: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కసింకోటలో నిర్వహిస్తున్న చిల్డ్రన్ హోమ్‌ను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం తనిఖీ చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. మెనూ ప్రకారం ఆహారం ఇవ్వాలని ఆదేశించారు. వారికి అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. సమస్యలు ఉంటే తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఈవో అప్పారావు ఉన్నారు.

March 16, 2026 / 07:05 AM IST

పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ

కృష్ణా: రంజాన్ మాసం సందర్భంగా గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు సామాజిక సేవకుడు మున్నా భాయ్ 100 మంది పేద ముస్లిం కుటుంబాలకు 11 రకాలతో కూడిన నిత్యవసర సరుకులతో రంజాన్ తోఫాను ఆదివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన రంజాన్ మాసం అనేది దానం, సహాయం, మానవతా విలువలను పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు.

March 16, 2026 / 07:03 AM IST

తిరుపతిలో భారీ జాబ్ మేళా

TPT: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ క్యార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్‌లో సోమవారం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 6 కంపెనీల ప్రతినిధులు పాల్గొని పదొవ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దాదాపు 650 ఉద్యోగాలకు భర్తీ చేపట్టనున్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.

March 16, 2026 / 07:03 AM IST

నేటి నుండి ఒంటిపూట బడులు ప్రారంభం : MEO

VZM: చీపురుపల్లి మండలంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు MEO బూసి నాయుడు ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఉదయం 7.45 నుంచి 12:30 వరకు తరగతులు నిర్వహించి, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. టెన్త్ పరిక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. 

March 16, 2026 / 07:02 AM IST

టెన్త్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

GNTR: కొల్లిపర మండలంలోని కొల్లిపర, అత్తోట, వల్లభాపురం పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని SI ఎన్.సి. ప్రసాద్ వెల్లడించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే ఈ పరీక్షల దృష్ట్యా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఆయన ఆదేశించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

March 16, 2026 / 07:02 AM IST