కృష్ణా: ఉంగుటూరు గ్రామ శివారులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎస్ఐ యు. గోవిందు తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4,210 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.