PLD: రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు గ్రామంలో వీరాంజనేయ స్వామి తిరుణాళ్లను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పొంగళ్ళు పెట్టారు. వీరాంజనేయ స్వామిని ప్రత్యేక అలంకరణ జరిపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భారీ విద్యుత్ ప్రభను ఏర్పాటు చేశారు. పాట కచేరీతో, కోలాటాలతో ఊరంతా సందడి వాతావరణం నెలకొంది.
KRNL: ఆలూరులో ఏఐటీయూసీ జిల్లా 21వ మహాసభలు ఇవాళ అట్టహాసంగా నిర్వహించారు. వేలాది కార్మికులతో ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. కార్మిక హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు.
సత్యసాయి: జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అట్రాసిటీ కేసుల పురోగతిపై SP సతీష్ కుమార్ కమిటీకి వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ప్రత్యేక ‘గ్రీవెన్స్’ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఆర్టీఓ కరుణాసాగర్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఏలూరు శాంతినగర్‌లో రోడ్లు, డ్రైన్లను పరిశీలించిన కలెక్టర్ వెట్రిసెల్వి నగరంలో అపరిశుభ్రతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, డ్రైన్లలో మురుగునీరు నిలిచిపోవడాన్ని గుర్తించి, సంబంధిత పారిశుద్ధ్య సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
E.G: జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన గృహాల గృహ ప్రవేశ కార్యక్రమాలను ఈ నెల 30వ తేదీన విస్తృతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. టిడ్కో, హౌసింగ్ పథకాల కింద నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమాలకు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు.
ASR: హుకుంపేట స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలోని వారపు సంత వేలంపాట ఏప్రిల్ 1 (బుధవారం) ఉదయం 11 గంటలకు పంచాయతీ కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు సర్పంచ్ సమీడ వెంకట పూర్ణిమ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వ్యాపారులు, యువత రెండు రోజుల ముందుగానే రూ.5,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.
ప్రకాశం: ఒంగోలు భాగ్యనగర్‌లో శనివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రమణయ్య మృతి చెందాడు. కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రమణయ్య క్రింద పడగా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తుండగా కానిస్టేబుల్ మృతి చెందాడు. ప్రమాదంపై పలువురు అధికారులు విచారం వ్యక్తం చేశారు.
GNTR: వ్యసనాలకు అలవాటు పడి వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరినీ నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.5.95 లక్షల విలువైన ఒక ఆటోతో పాటు 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో శనివారం వెస్ట్ సబ్ డివిజన్ ఇంఛార్జ్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు.
అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో TDP 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మండిపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ.. సంబేపల్లి, రాయచోటి టౌన్‌లలో ప్రధాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ప్రతి పంచాయతీలో పార్టీ జెండా ఆవిష్కరణకు నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
VZM: జిల్లాలో నాణ్యత లేని, కల్తీ ఆహార పదార్థాల విక్రయంపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ తెలిపారు. శనివారం జేసీ కోర్టులో నిర్వహించిన విచారణలో, జిల్లా ఆహార భద్రతాధికారి నాగల్ మీరా నమోదు చేసిన 10 ఫిర్యాదులపై విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన ఆహార వ్యాపారులపై సుమారు రూ. 2,83,500/- అపరాధ రుసుం విధించినట్లు వెల్లడించారు.
ATP: అనంతపురానికి చెందిన సుజాత వైద్య ఖర్చుల నిమిత్తం చేసిన విన్నపానికి మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. తన బృందానికి తగిన ఆదేశాలు జారీ చేశానని, ఆసుపత్రి యాజమాన్యంతో సమన్వయం చేసుకుని అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితురాలి కుటుంబం ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. లోకేష్ స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
NDL: జూపాడు బంగ్లా మండలం, బన్నూరుకు చెందిన గ్రామ YCP నాయకులు ఎల్లారెడ్డి సతీమణి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలిసిన YCP నేత ఎక్కలదేవి సలోమి శనివారం బన్నూరుకు చేరుకొని మహిళ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సత్యసాయి: నల్లమాడ మండల కేంద్రంలో శనివారం చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీడీవో అంజినప్ప వాహనాలకు పూజలు నిర్వహించి, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నల్లమాడ వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించి, బస్టాండ్ సర్కిల్ వద్ద మానవహారంగా నిలబడి స్వర్ణాంధ్ర–స్వచ్ఛ్ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
AKP: నర్సీపట్నంలో పర్యటిస్తున్న ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం శనివారం సాయంత్రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బాలికలతో కలిసి భోజనం చేశారు. గురుకుల పాఠశాలలో అందుతున్న సౌకర్యాలను బాలికలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్యలుంటే తమకు తెలియజేయాలని సూచించారు. మంచి ఉత్తీర్ణత శాతం తెచ్చుకోవాలని బాలికలకు సూచించారు.
NLR: దగదర్తి మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై శనివారం ఏపీడీ స్వరూప్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. సామాజిక తనిఖీలో జరిగిన అవకతవకలలో రూ.13,20,419లకు గాను రూ. 2,10,363 రికవరీ చేశారు. మిగిలిన రూ.11,10,056 రికవరీ చేయాల్సి ఉందని వారు పేర్కొన్నారు.