కోనసీమ: అయినవిల్లి మండలం క్రాప గ్రామానికి చెందిన చిక్కం లక్ష్మీ ఇటీవల జరిగిన ఏపీ డీఎస్సీ-2025 పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్ విభాగంలో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అంతే కాకుండా తాను చదువుకున్న కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లోనే పోస్టింగ్ దక్కించుకోవడం విశేషం. తాను చదువుకున్న క్లాస్ రూమ్‌లోనే తను విద్యార్ధులకు పాఠాలు చెప్పనుంది.
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు తులసి రెడ్డి మాట్లాడుతూ, వెలుగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం రూ.3,600 కోట్లు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆయన అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో 15లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని పేర్కొన్నారు.
KRNL: పత్తికొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి రైతుల పొలాలు కలకలాడుతూ.. వారి కుటుంబాలు సుఖశాంతులతో జీవించాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల దృష్ట్యా పుట్టపర్తిలో భద్రత కట్టుదిట్టం చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 216 సీసీ కెమెరాలు, 10 ఏఎన్‌పీఆర్ కెమెరాలు, 2 నైట్ విజన్ డ్రోన్లు, పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ నవంబర్ 2 నుంచి అందుబాటులోకి వస్తుందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలం పందిపర్తి అంబేద్కర్ కాలనీలో 9 నెలల గర్భవతి మౌనిక.. భర్త ఆశ్రయం కోసం నిరసన చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్దన్న స్పందించారు. ఆదివారం సాయంత్రం సమస్యను మౌనికతో అడిగి తెలుసుకున్నారు. న్యాయం జరిగే వరకు పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చట్టబద్ధంగా పోరాడుతామని భరోసా ఇచ్చారు.
VSP: విశాఖ పశ్చిమ నియోజకవర‍్గంలోని మల్కాపురం, ఇందిరాకాలనీ మైదానంలో జరిగిన డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో విజేతలకు కార్పొరేటర్ పీ.వీ. సురేశ్, వైసీపీ అంగ రామ్‌ప్రసాద్ చేతుల మీదుగా సర్టిఫికెట్‌లు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, నాయకులు పాల్గొన్నారు.
KDP: ఖాజీపేట(M) పుల్లూరు సమీపంలో నాగనాధేశ్వర ఆలయ కోన ప్రాంగణంలో ఉన్న కాశీనాయన ఆలయానికి నూతన ఆర్చి నిర్మాణం చేపట్టారు. ఆలయ కమిటీ,భక్తుల సహకారంతో ఈ నిర్మాణం చేపట్టినట్లు కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. కార్తీకమాసం ఉత్సవాల సందర్భంగా ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు రావాలని కమిటీ సభ్యులు కోరారు.
CTR: చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయానికి కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన భక్తురాలు కృష్ణవేణి రూ.25 వేలను విరాళంగా అందించారు. ఆదివారం ఆలయాన్ని సందర్శించిన ఆమె ఈవో, ఉప కమిషనర్ ఏకాంబరంకు నగదును అందజేశారు. అమ్మవారి కటాక్షంతో సుఖ సంతోషాలు కలగాలని ఈవో ఆకాంక్షించారు. ఆలయ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
NLR: ASపేట మండలం హసనాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిరుమన గ్రామానికి చెందిన ఉడప మాల్యాద్రి బైకు మీద సరుకుల కోసం వెళ్లి వస్తుండగా గేదెను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మాల్యాద్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
SKLM: గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఆదివారం నరసన్నపేట పట్టణంలో 12వ వార్డు పరిధిలో రూ. 1.50 కోట్ల నిర్మించిన సిమెంట్ రోడ్లు, ఇంటింటి కుళాయి వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చేసే దిశగా అన్ని విధాల కృషి చేస్తున్నానని అన్నారు.
కృష్ణా: గన్నవరం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ఆదివారం మృతి చెందాడు.సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా వ్యక్తిని ఓ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గన్నవరంలో ముఠా పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
VZM: కల్తీ మద్యం తయారీను నిరసిస్తూ రేపు నియోజకవర్గ కేంద్రంలో నిరసన చేపడుతున్నామని ఎంపీపీ పొట్నూరు ప్రమీల అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశాలతో చీపురుపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి కార్యాలయం ఎదుట నిరసన చేపడుతామన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు.
W.G: జిల్లాలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఈనెల 17న తణుకు SKSD మహిళా కళాశాలలో నిర్వహించనున్నట్లు కలెక్టర్, సెట్ వెల్ ఛైర్మన్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. 15న భీమవరం ఎస్ఆర్కఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా పోటీలు జరుగుతాయన్నారు. ఇతర వివరాలకు 9441446999 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ASR: హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. ఆదివారం అరకులో హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్లు 2, 13, 51 రద్దు చేయాలని కోరారు. ఈమేరకు ఈనెల 17న ఛలో పాడేరు కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రకాశం: దర్శిలో నవంబర్ 8, 9వ తేదీల్లో ప్రకాశం జిల్లా సీఐటీయూ 13వ మహాసభలు జరుగుతాయని జిల్లా నాయకుడు మాలకొండయ్య తెలిపారు. ఆదివారం వెలిగండ్లలో మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శిలో జరుగుతున్న ఈ మహాసభలో వేలాదిమంది కార్మిక ఉద్యోగులతో మహాప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. కావున కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.