VSP: పెదగంట్యాడ విద్యుత్ సబ్స్టేషన్ పరిధి గాంధీనగర్, వినాయకనగర్ ఫీడర్ల నిర్వ హణ పనుల కారణంగా ఇవాళ పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని జోన్-2 ఈఈ బీకే నాయుడు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిననడుపూరు, సీతానగరం, అయ్యప్ప టెంపుల్ రోడ్డులో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.