PLD: మాచర్ల పురపాలక పరిధిలో ఈ-వ్యర్థాల సేకరణకు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుండి పార్క్ సెంటర్ వరకు ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇకపై ప్రతి నెల 10, 20 తేదీల్లో ఈ సేకరణ ఉంటుందని, ప్రజలు తమ పాత ఎలక్ట్రానిక్ వస్తువులను మున్సిపల్ కార్యాలయంలోని కలెక్షన్ సెంటర్లో అందజేయాలని ఆయన కోరారు.