ప్రకాశం: యర్రగొండపాలెం వద్ద శుక్రవారం ఓ మారుతి కారు షార్ట్ సర్క్యూట్‌తో దగ్దమైంది. కాగా, కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు రావడంతో భయభ్రాంతులకు గురైన కారు యజమాని చంద్రశేఖర్ కారు నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. కారులో మంటలు చెలరేగి పూర్తిగా తగలబడి బుడిదైంది. అయితే ఈ ప్రమాదంపై పోలీసులు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
VZM: కొత్తవలస మండల వ్యవసాయ అధికారి రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యాన సహాయకులకు శిక్షణ కార్యక్రమం స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. శిక్షణ కార్యక్రమంలో మండల స్టాటిస్టిక్స్ అధికారి రాజు సహాయకులకు పంటకోత చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. ఇందులో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
CTR: కుప్పంలో ఎలక్ట్రానిక్ వస్తువుల మేళ మండల సమావేశం మందిరంలో నిర్వహించారు. దీనిని ఎమ్మెల్సీ శ్రీకాంత్ శుక్రవారం ప్రారంభించారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలక్ట్రానిక్స్ వస్తువులు, పలు రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించడంపై నియోజకవర్గ ప్రజలు సీఎం చంద్రబాబు నాయుడుకి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.
KKD: కేంద్రం తగ్గించిన GST రేట్లపై అధికారులు, నాయకులు విస్తృతంగా అవగాహన చేపడుతున్నా వ్యాపారులు పాత ధరలకే అమ్మకాలు సాగిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాలో ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా నోటుబుక్స్, గ్రాఫ్ బుక్స్, లాబొరేటరీ తదితర వస్తువులపై పన్ను జీరో శాతం చేసినా పాత ధరలతోనే అమ్ముతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు పన్ను తగ్గింపు ఫలాలు అందడం లేదు.
PLD: మాచవరం రైతు సేవా కేంద్రంలో 39.6 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని మండల వ్యవసాయ అధికారి రామమ్మ తెలిపారు. శుక్రవారం మాచవరంలో యూరియా పంపిణీ మొదలైంది. యూరియా పంపిణీ సమయంలో పొరుగు గ్రామాల రైతులు రావడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. పంపిణీ ఆలస్యం అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో అన్ని RBK యూరియా పంపిణీ చేస్తామని ఆమె తెలిపారు.
PPM: జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో వ్యవసాయ, ఉద్యానవన పంటలను వేసి, ఆ గ్రామాలకు ఆదాయం వచ్చేలా ఆలోచన చేస్తున్నామని కలెక్టర్ డా, ప్రభాకర రెడ్డి తెలిపారు. అందుకు తగిన విధంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.
SKLM: గార మండలంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం గ్రామంలోని శ్రీ శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని పాలకమండలి సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
ATP: కంబదూరు మండల కేంద్రంలో చేపట్టిన ఉపాధి హామీ పనులలో టీడీపీ నాయకులు అవినీతి, అక్రమాలు చేశారని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురంలోని DWMA కార్యాలయంలో పీడీకి ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ పనులలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని కోరారు.
సత్యసాయి: హిందూపురం వైసీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్‌ను జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆవిష్కరించారు. వైసీపీ నాయకులు రమేష్ రెడ్డి, టీజీఆర్ సుధాకర్ బాబు, దీపిక, ఈరలకప్ప పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలో 45 రోజుల పాటు ప్రజా ఉద్యమం చేపడతామని ఉషశ్రీ చరణ్ తెలిపారు.
NDL: కొలిమిగుండ్ల ఎంపీడీవో కార్యాలయం ఎదుట శుక్రవారం దివ్యాంగులు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. అనంతరం దివ్యాంగులు జేఏసీ జిల్లా అధ్యక్షుడు దేవరాజు దివ్యాంగులు కలిసి ఎంపీడీవో ప్రసాద్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.
కోనసీమ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పన, పనితీరు మెరుగుపడిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన రావులపాలెం ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం ఏ విధంగా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అన్నమయ్య: రాయచోటలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి బొకే అందించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు విషయాల పైన చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంక దినకర్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
GNTR: పొన్నూరు పట్టణంలోని షాదీఖానాలో సూపర్ GST-సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. GST తగ్గింపుల వల్ల అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
W.G: అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా)16వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఆకివీడు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జవహర్ పేటలో ఐద్వా జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు 3సం.లకు ఒకసారి మహాసభలు జరుగుతాయన్నారు.
KRNL: ఓర్వకల్లు మండలం MPDO కార్యాలయం నందు ఏపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “రాయితీపై శనగ విత్తనాల పంపిణీ” కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతులకు అవసరమయ్యే ప్రతీ కార్యక్రమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.