E.G: రాజానగరం మండలం పల్లకడియం గ్రామానికి చెందిన గంగలూరి పాపయమ్మకు రూ.23,400, రెక్కల చంటిబాబుకు రూ.52,723 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను జనసేన కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి గురువారం పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల కోసం పేదలు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ సాయం అందిస్తోందని ఆమె పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.