• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛత అవార్డు దక్కడం హర్షణీయం: సత్యం

కోనసీమ: రామచంద్రపురం మండలం కందుల పాలెం గ్రామైక్య సంఘానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు రావడం పట్ల కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం హర్షం వ్యక్తం చేశారు. ఏపీఎమ్ ఎస్.శ్రీధర్ ఆధ్వర్యంలో గ్రామ సంఘం అధ్యక్షురాలు అవ్వారి మంగాదేవి, వీవోఏ నాగలక్ష్మి, సంఘం సభ్యులు సత్యం‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామానికి ప్రతిష్టాత్మక అవార్డు రావడం స్ఫూర్తిదాయకం అన్నారు.

October 11, 2025 / 08:10 PM IST

నిందితులకు శిక్ష, బాధితులకు న్యాయం లక్ష్యం: ఎస్పీ

సత్యసాయి: కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లతో ఎస్పీ సతీష్ కుమార్ సమావేశం నిర్వహించారు. బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు. కేసుల పురోగతిని పర్యవేక్షించి, సాక్షులను సకాలంలో హాజరుపరచాలని ఆదేశించారు. కొత్త బీఎన్ఎస్ఎస్ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

October 11, 2025 / 08:10 PM IST

మద్యం కేసు నిందితులందర్నీ అరెస్టు చేస్తాం: మంత్రి

అన్నమయ్య: ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించామని,14 మందిని అరెస్టు చేశామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏ1గా ఉన్న జనార్దనావును కస్టడీలోకి తీసుకున్నామని, నాలుగు ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరుతోపాటు ఏపీలోనూ దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. త్వరలో APTATS యాప్ ద్వారా మద్యం బాటిళ్ల వివరాలు తెలుసుకుంటామన్నారు.

October 11, 2025 / 08:05 PM IST

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు : SI

మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని SI మహమ్మద్ రఫీ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడారు. వాహనాలు తనిఖీల్లో భాగంగా సిద్ధవటంలో శుక్రవారం రాత్రి ఎస్.రాజంపేట గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి ద్విచక్ర వాహంలో వస్తుండగా మద్యం సేవించినట్లు నిర్ధారించి అతనిపై కేసు నమోదు చేసామన్నారు.

October 11, 2025 / 08:01 PM IST

మూడు సిల్వర్ మెడల్స్ సాధించిన ప్రొద్దుటూరు బాలిక

KDP: శనివారం కడపలో నిర్వహించిన జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీల్లో ప్రొద్దుటూరుకు చెందిన సారా ఇర్ఫాన్ మూడు సిల్వర్ మెడల్స్ సాధించింది. దీంతో విశాఖలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు సారా ఇర్ఫాన్ ఎంపికయ్యారు. అండర్-14 ఇన్ లైన్ విభాగంలో రోడ్-1, రింగ్-3, రింగ్-4 కేటగిరిలో ప్రతిభను సాధించింది. 

October 11, 2025 / 07:59 PM IST

ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్‌కు విశేస స్పందన

VZM: స్థానిక మ్యూజిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ – కం – సేల్స్ కు వినియోగదారుల నుండి విశేష స్పందన లభించిందని జీఎస్టీ జాయింట్ కమిషనర్ నిర్మల జ్యోతి పేర్కొన్నారు. శుక్ర, శనివారాలలో 2 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో సుమారు రూ. 25,000 పైగా లబ్ధి పొందినట్లు ఆమె తెలిపారు. జీఎస్టీ చెల్లింపుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నమన్నారు.

October 11, 2025 / 07:59 PM IST

‘పార్టీ బలోపేతమే మన లక్ష్యం’

W.G: వైసీపీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆచంట మండలం కొడమంచిలి గ్రామ సర్పంచ్ సుంకర సీతారాం అన్నారు. ఈ సందర్భంగా శనివారం మండలంలోని కోడేరు గ్రామ కమిటీ నియామకాన్ని ఆయన నియమించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మామిడిశెట్టి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. అనంతరం వారిని అభినందించారు.

October 11, 2025 / 07:59 PM IST

పట్టుకుంటే రూ.పది లక్షలు: రాచమల్లు

KDP: అసలుకు నకిలీకి ఏ మాత్రం తేడా లేకుండా పచ్చ బ్యాచ్ నకిలీ మద్యం మార్కెట్లోకి తీసుకువచ్చారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఆయన శనివారం పొద్దుటూరులో మద్యం బాటిళ్లు తీసుకుని సమావేశం నిర్వహించారు. ఇందులో అసలు ఏదో, నకిలీ ఏదో పట్టుకుంటే రూ.పది లక్షలు ఇస్తామని సవాల్ చేశారు.

October 11, 2025 / 07:54 PM IST

‘ఎంపీటీసీలకు వేతనాలు అందజేయాలి’

SKLM: ప్రజలు అవసరాలు, సమస్యలు పరిష్కరించడానికి ఎంపీటీసీలకు గత 16 నెలల నుంచి వేతనాలు అందక ఇబ్బంది పడుతున్న వాళ్లకు వేతనాలు ఇప్పించాలని మండల వైస్ ఎంపీపీ గునుపురం రామారావు కోరారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికలు వచ్చిన నోటిఫికేషన్ నుంచి ఎంపీటీసీలకు కనీసం రాజ్యాంగం ప్రకారము ఇవ్వవలసిన వేతనాలు కూటమి ప్రభుత్వం అందించలేదన్నారు.

October 11, 2025 / 07:51 PM IST

పిచ్చి కుక్క దాడిలో ఐదు మందికి గాయాలు

ATP: గుంతకల్లు పట్టణంలోని పక్కిరప్ప కాలనీలో శనివారం పిచ్చికుక్క దాడిలో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్క దాడిలో గాయపడిన నాగరాజు మాట్లాడుతూ.. కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

October 11, 2025 / 07:50 PM IST

పాలకొల్లు కాలేజీలో జూబ్లీ వేడుకలు

W.G: పాలకొల్లులో “KVM ఛాంబర్స్ జూనియర్ కళాశాల” గోల్డెన్ జూబ్లీ, “BRR & GKR ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాల” పెర్ల్ జూబ్లీ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు పాల్గోని కళాశాలలో ఏర్పాటు చేసిన నూతన కంప్యూటర్ బ్లాక్‌ను ప్రారంభించారు.

October 11, 2025 / 07:44 PM IST

కడపలో కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం

KDP: కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షురాలు ఎన్.డీ విజయ జ్యోతి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ సెక్రెటరీ కుమార్ హాజరయ్యారు. రాబోయే లోకల్ కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుపొందించాలని వారు సూచించారు.

October 11, 2025 / 07:41 PM IST

సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీపీ

SKLM: ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేట గ్రామంలో సీసీ రోడ్ మరియు డ్రైనేజీ నిర్మాణ పనులను ఎంపీపీ మొదలవలస చిరంజీవి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.5 లక్షల మండల పరిషత్ నిధులతో ఈ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతతో కూడిన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.

October 11, 2025 / 07:41 PM IST

దారుణం.. ఎద్దుల దాడిలో బాలుడు మృతి

KRNL: మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలో ఎద్దుల బండి ప్రమాదంలో బాలుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాజా అనే రైతు ఎద్దుల బండితో పొలం పనులకు వెళ్తుండగా ఎద్దులు అకస్మాత్తుగా బెదిరి, అదే గ్రామానికి చెందిన బీరప్ప అనే బాలుడిపై దాడి చేశాయి. గాయాలతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు.

October 11, 2025 / 07:40 PM IST

‘గురువులు సమాజానికి ఆదర్శం’

ELR: జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగ భవాని ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ అధ్యక్షతన డీఎస్సీ- 2025 ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. గురువులు సమాజానికి ఆదర్శమని అన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో గురువులపై కక్ష సాధింపులకు పాల్పడితే కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ తీసి ఇచ్చిన మాట నిలబెట్టుకుని నూతన ఉపాధ్యాయులను నియమించిందని తెలిపారు.

October 11, 2025 / 07:35 PM IST