ప్రకాశం: ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌పై ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్‌లో పాల్గొన్నా, నిర్వహించినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలతో నిఘా, తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
VZM: కలెక్టర్, ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆదేశాలమేరకు కమిటీ సభ్యులను ఎన్నికకై సొసైటీ వార్షిక సాధారణ సర్వ సభ్య సమావేశం ఏప్రిల్ 16న నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కార్యదర్శి సత్యం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నిక ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికకు హాజరయ్యే సభ్యులు గుర్తింపు కార్డుతో రావాలని కోరారు.
KKD: అనాథ పిల్లలకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎస్‌కెఆర్ మహిళ కళాశాల ఎదురుగా రూ.78 లక్షలతో చేపట్టనున్న సదనం చిల్డ్రన్ హోమ్ నూతన భవన నిర్మాణానికి శనివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. చిల్డ్రన్ హోమ్ సామర్థ్యం పెరిగి మరింత మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించే అవకాశం ఉంటుందన్నారు.
W.G: ఈస్టర్ పునస్కరించుకొని ఏప్రిల్ 4న నరసాపురంలో ఘనంగా ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత 13 ఏళ్లుగా దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ పరుగుకు సంబంధించి శనివారం సాయంత్రం స్థానిక మిషన్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో రన్ ఫర్ జీసస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యక్రమ పోస్టర్లు, కరపత్రాలు, టీషర్టులు ఆవిష్కరించారు.
PPM: ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రిల్లో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ పక్కాగా ఉండాలని, పరిశుభ్రతతో వ్యాదులు వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా ఎన్‌సీడీ అధికారి జగన్ మోహనరావు సూచించారు. సీతానగరం ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛంద్రా కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఆసుపత్రి పరిసరాలను, నిర్వహణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డా. పావని పాల్గొన్నారు.
PLD: గుండ్లపాడు జంట హత్యల కేసులో బెయిల్‌పై విడుదలైన మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని, YCP పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని పిన్నెల్లి నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న రోజుల్లో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇద్దరు నేతలు చర్చించారు.
BPT: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బాపట్ల పట్టణ సీఐ రాంబాబు సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యాన్ని చేరాలని తెలిపారు. పట్టణ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో శనివారం చీల్ రోడ్ సెంటర్ వద్ద హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై వివరించారు.
ELR: ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో రహదారులకు మహాదశ పట్టిందని నారాయణపురం గ్రామ సర్పంచి దిడ్ల అలకనంద శ్రీనివాస్ అన్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి కాలేజ్ రోడ్డు వరకునిర్మిస్తున్న సీసీ డ్రైన్ పనులను సర్పంచ్ శనివారం పరిశీలించారు.
సత్యసాయి: హిందూపురంలోని చిన్నమార్కెట్ ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్‌ను శనివారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజన నాణ్యతను పరిశీలించి స్వయంగా ఆహారాన్ని రుచి చూశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. క్యాంటీన్ పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
NDL: అక్రమ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పీ.డీ.ఎస్.యూ డిమాండ్ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. అనుమతులు లేకుండా పాఠశాలలు నడుస్తున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.
TPT: జిల్లాలోని ఏర్పేడు, వెంకటగిరి, నాయుడుపేట తదితర ప్రాంతాల వరి పంటను నెల్లూరు జిల్లాలోని మిల్లర్లకు తరలిస్తున్నారు. ప్రభుత్వం వరిని కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ, అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. రైతులు తీసుకువెళ్లే ధాన్యంలో తేమ ఉందని కారణాలు చెబుతూ మిల్లర్లు వెనక్కి పంపుతున్నారు. దీంతో దిక్కుతోచని రైతులు రూ. 2,000 కంటే తక్కువ ధరకే తమ పంటను దళారులకు విక్రయిస్తున్నారు.
ATP: జిల్లాలో మార్చి నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలోని 2,76,547 మంది కోసం రూ.124 కోట్లు విడుదల చేసింది. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి స్వచ్ఛంద సేవకులు, వార్డు సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్ సొమ్ము అందజేస్తారని అధికారులు తెలిపారు. పింఛన్ కోసం ఎవరూ సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
కర్నూలులో హోటల్ ప్రైమ్ ల్యాండ్‌లో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ట్రూ కోడ్ అకాడమీ ఆధ్వర్యంలో 9 కంపెనీలు పాల్గొని 2000కి పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉంచాయి. టెన్త్ నుంచి బీటెక్ వరకు అభ్యర్థులు హాజరై, రూ. 2.7 లక్షల నుంచి రూ.3.5 లక్షల జీతం అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ప్రకాశం: కొండేపి నియోజక వర్గ స్థాయి ఏఐటీయూసీ (AITUC) ద్వితీయ మహాసభలు టంగుటూరులోని సౌత్ బీసీ కాలనీలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలో నియోజక వర్గంలోని కార్మికుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏఐటీయూసీ కొండేపి నియోజవర్గ (AITUC) అధ్యక్షులుగా జాకీర్, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ రావు, కోశాధికారిగా ప్రసాదరావులును ఎన్నుకున్నారు.
GNTR: అమరావతికి అనుకూలమో, వ్యతిరేకమో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని అంశంపై శనివారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. అమరావతి రైతుల త్యాగాన్ని గుర్తుచేసిన లోకేష్, “వారి త్యాగం వల్లే మనమందరం ఈరోజు ఇక్కడ ఉన్నాం’ అన్నారు.