• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గన్నవరం, నూజివీడు NTR జిల్లాలోకి లేనట్టేనా.!

కృష్ణా: జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు మంత్రులపై ఫైర్ అయ్యారు. విజయవాడలో భాగమైన పెనమలూరును వదిలేసి ఎక్కువ దూరంలోని నూజివీడును NTR జిల్లాలో కలిపే ప్రతిపాదన ఏంటని CM మంత్రివర్గాన్ని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం, ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాలను NTR జిల్లాలో కలపాలని ఉపసంఘం ప్రతిపాదించిందగా NTR జిల్లాలో మార్పులు, చేర్పుల తర్వాత చూద్దామన్నారు.

November 25, 2025 / 09:46 AM IST

బేస్తవారిపేటలో లాడ్జి తనిఖీలు

ప్రకాశం: బేస్తవారిపేటలోని పలు లాడ్జిలను ఎస్ఐ రవీంద్రారెడ్డి సోమవారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతను ప్రాధాన్యంగా తీసుకొని రాత్రి వేళల్లో నేర కార్యకలాపాలను నిరోధించడం, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం, శాంతి భద్రతలను కాపాడడం లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

November 25, 2025 / 09:46 AM IST

పుట్టపర్తిలో కొనసాగుతున్న ప్రయాణికుల రద్దీ

సత్యసాయి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ శత జయంతి ఉత్సవాలు ముగిసినప్పటికీ పుట్టపర్తి బస్టాండ్‌లో మంగళవారం కూడా ప్రయాణికుల రద్దీ తగ్గలేదు. వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు, ప్రయాణికులు భారీ సంఖ్యలో బస్సులు కోసం వేచి చూస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అదనంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.

November 25, 2025 / 09:46 AM IST

కూరగాయలు కొనేదెలా? తినేదలా..?

VSP: విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు భగ్గుమంటున్నాయి. (కేజీ/రూ.లలో) టమాటా 50, ఉల్లి 19, బంగాళదుంప 19, వంకాయ 64, బెండకాయ 50, మిర్చి 40, క్యాబేజీ 26, కాలిఫ్లవర్ 34, కాకర 54, బీరకాయ 56, ఆనపకాయ 30, క్యారెట్ 56, బీన్స్ పిక్కలు 220, దొండ 42, కీర 36, అల్లం 60, పొటల్స్ 64, పెన్సిల్ బీన్స్ రూ.54, కాప్సికం రూ.70,బీట్ రూట్ రూ.42గా ఉన్నాయి.

November 25, 2025 / 09:45 AM IST

సత్తెనపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

PLD: సత్తెనపల్లి టౌన్‌లోని ఈద్గా దర్గా ముందు సుమారు 70 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధుడు మంగళవారం మృతదేహంగా కనిపించాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. గుర్తు తెలియని ఈ వృద్ధుడిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

November 25, 2025 / 09:45 AM IST

తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్

TPT: హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఫైల్స్ వేగంగా ముందుకు కదులుతున్నాయి. సంబంధిత అలైన్మెంట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి SCR పంపింది. ముందుగా గూడూరు స్టాఫింగ్ అనుకునప్పటికీ తిరుపతిలో స్టాఫింగ్ ఉండేలా ప్లాన్ చేయాలని TN ప్రభుత్వం కోరింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం 12 గంటలుండగా బుల్లెట్ ట్రైన్లో కేవలం2.20 గంటల్లోనే చేరుకోవచ్చు.

November 25, 2025 / 09:37 AM IST

‘అధికారులు 100 శాతం సర్వే పూర్తి చేయాలి’

NLR: కోవూరు నియోజకవర్గంలో అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులకు ఇంటి స్థలం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని ఆమె నివాసంలోఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హౌసింగ్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈనెల 30న ఆఖరి గడువు ఈ లోపు సర్వేను పూర్తి చేయాలన్నారు.

November 25, 2025 / 09:35 AM IST

బండి ఆత్మకూరులో ఇంట్లో పేలిన ఫ్రిడ్జ్

NDL: బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురం గ్రామంలో సోమవారం రాత్రి ఏ.దేవి వెంకటరమణ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి మంటలు చెలరేగాయి. ఫ్రిడ్జ్ నుంచి పొగ మంటలు రావడం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై బయటికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. ఫ్రిడ్జ్ పేలడానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుగుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

November 25, 2025 / 09:32 AM IST

KRNL: నేటి నుంచి బీఈడీ సెమిస్టర్ పరీక్షలు

KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బీఎడ్ 3వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు VC వెంకటేశ్వర్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 19 పరీక్షా కేంద్రాల్లో B.ED రెగ్యులర్ 3,474, సప్లిమెంటరీ 471 మంది, BPED రెగ్యులర్ 145, సప్టిమెంటరీ 21 మంది, MPED రెగ్యులర్ 86 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు.

November 25, 2025 / 09:30 AM IST

CMను కలిసిన పూతలపట్టు ఎమ్మెల్యే

CTR: సీఎం చంద్రబాబును అమరావతిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోమన్ కలిశారు. కాణిపాకం తీర్థప్రసాదాలను ముఖ్య మంత్రికి అందజేశారు. కాణిపాకం ఆలయ పాలకవర్గ నియామక జీవోను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నుంచి అందుకున్నారు. కార్యాలయంలో ఎమ్మెల్యే మురళీమోమన్‌ తోపాటు మణి నాయుడు, హరిబాబు నాయుడు, ధరణి ప్రసాద్ పాల్గొన్నారు.

November 25, 2025 / 09:24 AM IST

దారి తప్పుతోంది… బాగుచేయరూ

PPM: గరుగుబిల్లి మండలంలోని రాయందొరవ లస నుంచి పార్వతీపురం మండలం వీఆర్ పేట వరకు ఉన్న లింకు రోడ్డు కోతకు గురవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి జారి, రాళ్లు తేలిపోయాయి. వాహనాలు నడపలేని స్థితి ఏర్ప డింది. మరమ్మతులు చేసి రహదారి సౌకర్యం కల్పించా లని స్థానికులు కోరుతున్నారు. పంచాయతీ రాజ్ శాఖ పరిష్కరించాలని కోరారు.

November 25, 2025 / 09:23 AM IST

నరసన్నపేటలో కుక్కలు బాబోయ్.. కుక్కలు

SKLM: నరసన్నపేట‌లో ఎక్కడ చూసినా శునకాల గుంపులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా పలు జంక్షన్‌లో వద్ద సంచరించటంతో స్థానికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ వద్ద ఈ సంచారం ఎక్కువగా ఉండటంతో రోగులు సైతం అవస్థలు పడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

November 25, 2025 / 09:19 AM IST

అన్నదాత సుఖీభవపై ప్రజాభిప్రాయ సేకరణ

CTR: GDనెల్లూరు మండలంలో వారం రోజులు అన్నదాత సుఖీభవ పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు స్వామిదాస్ తెలిపారు. ఎమ్మెల్యే డా. థామస్ ఆదేశాలతో మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో రైతులతో మాట్లాడతామని చెప్పారు. వారి అభిప్రాయాలు తెలుసుకుని టీడీపీ అధిష్ఠానానికి నివేదిస్తామన్నారు.

November 25, 2025 / 09:16 AM IST

లంచం డిమాండ్‌పై నేడు బహిరంగ విచారణ

VZM: భూముల మ్యూటేష‌న్‌ చేయ‌డానికి విజ‌య‌న‌గ‌రం మండ‌ల రెవెన్యూ కార్యాల‌యంలో లంచం అడుగుతున్నార‌న్న ఫిర్యాదుపై ఇవాళ బ‌హిరంగ విచార‌ణ నిర్వహించనున్నారు. పీజీఆర్ఎస్ నోడ‌ల్ అధికారి, కెఆర్ఆర్‌సీ ప్ర‌త్యేక ఉప‌క‌లెక్ట‌ర్ ముర‌ళి సోమవారం తెలిపారు. మ్యూటేషన్ చేయడానికి, పట్టాదారు పాసుపుస్తకాలు జారీకి అధికారులు రూ. ...

November 25, 2025 / 09:14 AM IST

డిమాండ్ ఆధారిత సాగుతో లాభాలు: ఏడీ

W.G: తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని చినతాడేపల్లి, పెదతాడేపల్లి, రామన్నగూడెం గ్రామాల్లో సోమవారం ‘రైతన్నమీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఏడీ గంగాధరరావు, ఏవో పి. నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్‌పై అవగాహన కల్పించారు. రైతుల ఫోన్లలో వ్యవసాయ సమాచార యాప్ 2.0ను నిక్షిప్తం చేశారు.

November 25, 2025 / 09:11 AM IST