కోనసీమ: రాష్ట్ర రాజధాని అమరావతి సాధనలో ఏం. ఏ షరీఫ్ పాత్ర కీలకమని ఆయన్ను రాజ్యసభకు పంపాలని TDP రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ గురువారం పేర్కొన్నారు. విజయం అనేది ఒక్కరి కృషి కాదనీ అనేక మంది త్యాగాలు, పోరాటాలు, సహనాల సమాహారం అని అన్నారు. విద్రోహ చర్యలను అధిగమించి పార్లమెంట్ ఉభయ సభల సమ్మతి పొందడం ఒక చారిత్రాత్మక ఘట్టమన్నారు.