అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో TDP 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మండిపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ.. సంబేపల్లి, రాయచోటి టౌన్‌లలో ప్రధాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ప్రతి పంచాయతీలో పార్టీ జెండా ఆవిష్కరణకు నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
VZM: జిల్లాలో నాణ్యత లేని, కల్తీ ఆహార పదార్థాల విక్రయంపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ తెలిపారు. శనివారం జేసీ కోర్టులో నిర్వహించిన విచారణలో, జిల్లా ఆహార భద్రతాధికారి నాగల్ మీరా నమోదు చేసిన 10 ఫిర్యాదులపై విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన ఆహార వ్యాపారులపై సుమారు రూ. 2,83,500/- అపరాధ రుసుం విధించినట్లు వెల్లడించారు.
ATP: అనంతపురానికి చెందిన సుజాత వైద్య ఖర్చుల నిమిత్తం చేసిన విన్నపానికి మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. తన బృందానికి తగిన ఆదేశాలు జారీ చేశానని, ఆసుపత్రి యాజమాన్యంతో సమన్వయం చేసుకుని అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితురాలి కుటుంబం ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. లోకేష్ స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
NDL: జూపాడు బంగ్లా మండలం, బన్నూరుకు చెందిన గ్రామ YCP నాయకులు ఎల్లారెడ్డి సతీమణి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలిసిన YCP నేత ఎక్కలదేవి సలోమి శనివారం బన్నూరుకు చేరుకొని మహిళ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సత్యసాయి: నల్లమాడ మండల కేంద్రంలో శనివారం చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీడీవో అంజినప్ప వాహనాలకు పూజలు నిర్వహించి, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నల్లమాడ వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించి, బస్టాండ్ సర్కిల్ వద్ద మానవహారంగా నిలబడి స్వర్ణాంధ్ర–స్వచ్ఛ్ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
AKP: నర్సీపట్నంలో పర్యటిస్తున్న ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం శనివారం సాయంత్రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బాలికలతో కలిసి భోజనం చేశారు. గురుకుల పాఠశాలలో అందుతున్న సౌకర్యాలను బాలికలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్యలుంటే తమకు తెలియజేయాలని సూచించారు. మంచి ఉత్తీర్ణత శాతం తెచ్చుకోవాలని బాలికలకు సూచించారు.
NLR: దగదర్తి మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై శనివారం ఏపీడీ స్వరూప్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. సామాజిక తనిఖీలో జరిగిన అవకతవకలలో రూ.13,20,419లకు గాను రూ. 2,10,363 రికవరీ చేశారు. మిగిలిన రూ.11,10,056 రికవరీ చేయాల్సి ఉందని వారు పేర్కొన్నారు.
పల్నాడు జిల్లాలో “మనబడి మన భవిష్యత్” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠశాలల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 13 తేదీ నాటికి పనులు పూర్తి చేయాలన్నారు.
అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్‌లోని PGRS సమావేశ మందిరంలో పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగభూషణం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించిన మహనీయులని తెలిపారు.
కడప జిల్లా బద్వేలు బైపాస్ రోడ్‌లో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం సమయంలో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
CTR: పుంగనూరు న్యాయవాదుల సంఘం ఎన్నికలు శనివారం నిర్వహించారు. సంఘం అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది విజయ్ కుమార్, కార్యదర్శిగా అరవింద్ కుమార్, ఉపాధ్యక్షుడిగా గురుమూర్తి ఎన్నికయ్యారు. గెలుపొందిన వారిని తోటి న్యాయవాదులు ఘనంగా సన్మానించారు.
TPT: శ్రీకాళహస్తి పట్టణ ప్రాంత మహిళల కోసం ‘చాయ్ రాస్తా’ పథకం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతను, స్వయం ఉపాధిని పెంపొందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి డ్వాక్రా (DWACRA) మహిళా సభ్యులు అర్హులు. మెప్మా ద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు, బ్యాంక్ రుణం, సబ్సిడీ సౌకర్యం కూడా కల్పిస్తారు. ఈ పథకం కింద సుమారు 75% నుంచి 90% వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.
ASR: కొయ్యూరు మండలం బాలారం పంచాయతీ సర్పంచ్ అప్పన అప్పలనర్సకు అరుదైన గౌరవం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేదిక పంచుకునే అవకాశం లభించింది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 29న జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో ఆమె స్టేజీ పంచుకోనున్నారు. సీఎంతో వేదిక పంచుకునే అవకాశం లభించడం పట్ల సర్పంచ్ అప్పలనర్స శుక్రవారం సంతోషం వ్యక్తం చేశారు.
VZM: వైసీపీపై విమర్శలు,బురద జల్లడానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించడం ఎందుకని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. జడ్పీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి పేరుతో జరిగిన దోపిడీని మాత్రమే తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, రాజధాని, అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానమన్నారు.
NTR: వీరులపాడు మండలం వి.అన్నవరం గ్రామంలో ఈ నెల 30న జ్యోతిరావు ఫూలే, డా. బి.ఆర్. అంబేద్కర్ మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం బందోబస్తు ఏర్పాట్లను విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ పరిశీలించారు.