AKP: జనన మరణాల నమోదుపై ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువచ్చిందని డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ హైమావతి గురువారం తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం జనన మరణాల రిజిస్ట్రేషన్‌ను 21 రోజుల్లో ఉచితంగా నమోదు చేయించుకోవచ్చునని సూచించారు. 21 రోజుల నుంచి 30 రోజుల్లో నమోదు చేస్తే రూ.25, 30 నుంచి ఏడాదిలోపు రూ.250 అపరాధ రుసుం చెల్లించాలన్నారు.