• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కేజీహెచ్‌లో విద్యార్థినులను పరామర్శించిన మంత్రి

VSP: అనారోగ్యంతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థినులను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం పరామర్శించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్‌లతో కలిసి కేజీహెచ్‌కి వెళ్లిన మంత్రి, చికిత్స పొందుతున్న విద్యార్థినుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

October 7, 2025 / 07:20 PM IST

‘ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి’

NDL: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తి స్థాయిలో విడుదల చేయాలని పీడీఎస్‌యు జిల్లా కార్యదర్శి పి. మర్రిస్వామి డిమాండ్ చేశారు. నందికొట్కూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. అనంతరం MRO శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 6400 కోట్లు ఉంటే రూ. 400 కోట్లు విడుదల చేశారన్నారు.

October 7, 2025 / 07:20 PM IST

నార్త్ డివిజన్లలో భద్రత బలోపేతంపై ఎస్పీ ఆదేశాలు

GNTR: తుళ్లూరు, నార్త్ పోలీస్ సబ్ డివిజన్లలో భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయాలని ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గుంటూరు మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు. వీవీఐపీలు, వీఐపీలు నివసించే ఈ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలని అన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల చెలామణిని అరికట్టడానికి నిఘా పెంచాలన్నారు.

October 7, 2025 / 07:14 PM IST

మాజీ సీఎంను కలిసిన జిల్లా వైసీపీ అధ్యక్షురాలు

SS: మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కలిశారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై తమ అధినేత కీలక సూచనలు చేశారని పేర్కొన్నారు.

October 7, 2025 / 07:14 PM IST

కర్నూలులో ఆటో నడిపిన మంత్రి

KRNL: కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీహామీని నెరవేర్చుతోందని మంత్రి TG భరత్ అన్నారు. ఇవాళ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్ర మాట్లడుతూ.. ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు రూ. 15 వేలు ఇవ్వడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.

October 7, 2025 / 07:13 PM IST

జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్

PPM: మన్యం జిల్లాలో పచ్చకామెర్లు, హెపటైటీస్‌తో ఆసుపత్రిలో చేరిన విద్యార్థుల కేసులు తగ్గుముఖం పట్టాయని, ఇది శుభపరిణామమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.మల్లికార్జున నాయక్‌తో కలిసి మంగళవారం కురుపాం గురుకుల పాఠశాలను, పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రిని పరిశీలించారు

October 7, 2025 / 07:13 PM IST

రాజారెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి రోజా

TPT: వడమాలపేట మండలం వడమాలపేట టౌన్‌లో నియోజకవర్గ YCP ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ రాజారెడ్డిని మాజీ మంత్రి రోజా పరామర్శించారు. ఆయన ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆయన నివాసానికి వెళ్లి రాజారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు.

October 7, 2025 / 07:10 PM IST

గుత్తిలో నూతన ఆధార్ కేంద్రం ప్రారంభం

ATP: గుత్తి కోటవీధిలోని 6వ సచివాలయంలో ఇవాళ మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా నూతన ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ఆధార్ కరెక్షన్, కొత్త ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ప్రజలందరూ ఆధార్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

October 7, 2025 / 07:09 PM IST

‘నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి’

కోనసీమ: రావులపాలెం మండలం గోపాలపురం పంచాయతీ పరిధి పల్లి పాలెం నుండి గోపాలపురం నేషనల్ హైవే కెనాల్ వరకూ జరుగుతున్న రోడ్ పనులను రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ఆకుల రామకృష్ణ పరిశీలించారు. పనులను పూర్తి నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆయన సూచించారు.

October 7, 2025 / 07:05 PM IST

ఘనంగా పదవీ విరమణ కార్యక్రమం

NLR: కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎం వి కృష్ణయ్య ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండల విద్యాశాఖ అధికారి సురేష్, ఉపాధ్యాయులు మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

October 7, 2025 / 07:04 PM IST

‘పేదవాడికి అండగా సీఎంఆర్ఎఫ్’

W.G: మొగల్తూరు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉన్న లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి మొత్తం రూ. 11,86,440 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి అండగా సీఎం సహాయనిది భరోసా ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

October 7, 2025 / 07:02 PM IST

విషపు ఆహారం తిని 20 మేకలు మృత్యువాత

ATP: పుట్లూరు మండలం కొండుగారి కుంట గ్రామంలో ఇవాళ దారుణం చోటు చేసుకుంది. విషపు ఆహారం తిని 20 మేకలు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని అస్వస్థతకు గురయ్యాయి. గ్రామ శివారులో మేతమేస్తున్న సమయంలో ఈ దారుణం నేలకొంది. విషపు ఆహారం తినడం వల్లే మేకలు మృతి చెందినట్లు మేకల కాపరి ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని, తమను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

October 7, 2025 / 07:01 PM IST

‘ఉద్యోగుల బకాయిలకు భూములు కేటాయించాలి’

VSP: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల విలువకు సరిపడ ప్రభుత్వ భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జీవిఎంసీ వైయస్సార్ పార్క్‌లో మంగళవారం జరిగిన విశాఖ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన, బకాయిలను సర్వీస్ రిజిస్టర్లలో పొందుపరచాలని సూచించారు.

October 7, 2025 / 07:00 PM IST

కాకినాడ జెసికి వినతిపత్రం అందించిన లాయర్లు

KKD: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి‌పై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం కాకినాడ బార్‌లో న్యాయవాదులు నిరసన చేపట్టారు. అనంతరం దాడికి పాల్పడిన న్యాయవాది‌పై చర్యలు తీసుకోవాలని కాకినాడ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమం‌లో కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

October 7, 2025 / 06:48 PM IST

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌ను కలిసిన ఎస్.కోట ఎమ్మెల్యే

VZM: రేపటి నుంచి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మూడు రోజులపాటు జరగనున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో భాగంగా తిరుపతి పద్మావతి అతిథి గృహంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పులపర్తి ఆంజనేయులును ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

October 7, 2025 / 06:47 PM IST