TPT: వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఏప్రిల్ 1న పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చింతగుంటలో పింఛన్ల పంపిణీ, గుండ్లసముద్రంలో ఇళ్ల ప్రారంభం, మున్సిపల్ కార్యాలయంలో విజన్ ప్లాన్ ఆఫీస్, చలివేంద్రం ప్రారంభం కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం డక్కిలిలో శ్రీ స్థంబాలగిరీశ్వర స్వామి ఉత్సవాల ఏర్పాట్లపై శాంతి సమావేశంలో పాల్గొంటారు.
కోనసీమ: అమలాపురంలో పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన పుష్కరిణిలో స్వామివారిని శేష వాహనంపై అధిష్టింపజేసి విహరింపజేశారు. ఈ వేడుకను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.
CTR: చిత్తూరు టీడీపీ కార్యాలయంలో అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. రెండు విడతల్లో 5.5 లక్షల ఇళ్లు పంపిణీ చేశామని, భారీ పెట్టుబడులతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అమరావతి త్వరలోనే చట్టబద్ధ రాజధానిగా అవుతుందని స్పష్టం చేశారు.
CTR: అక్రమంగా గుట్కా రవాణా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఒక ఆటో, గుట్కా సరుకును స్వాధీనం చేసుకున్నట్లు గుడిపాల రూరల్ ఎస్సై రామమోహన్ పేర్కొన్నారు. నిషేదిత గుట్కా తరలిస్తే ఖటిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండుకు తరలించనున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణాంధ్ర P-4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి డీఈవో సాగర్ బాబు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈవో ధనపాల్, ఆలయ సూపరింటెండెంట్ వాసు పాల్గొన్నారు.
BPT: ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో విజేతగా నిలిచిన ప్రేమ్ సాగర్ బాపట్ల జిల్లాకు వన్నెతెచ్చాడని కలెక్టర్ అభినందించారు. అతని ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రేమ్ సాగర్ తన క్రీడా నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చీరాల ఎమ్మెల్యే కొండయ్య హామీ ఇచ్చారు.
PDL: వినుకొండ నియోజకవర్గంలో బుధవారం నిర్వహించే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కూటమి నాయకులకు తెలియజేశారు. ముఖ్యంగా వృద్ధులు వికలాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని వారి ఇల్లవద్దకే వెళ్లి సేవలు అందించాలని కూటమి నాయుకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు తెలియజేశారు.
ప్రకాశం: ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజుకు రాబడిన సమాచారం మేరకు మామిడిపాలెం సెంటర్ వాహనాలు తనిఖీలు నిర్వహించారు. కొత్త పట్టణం(మం) పాత గ్రామానికి చెందిన అదేటి ఏడుకొండలు గంజాయి దొంగిలించిన బైక్‌తో పట్టుబడ్డాడు. విచారించగా ఒంగోలుతో పాటు పలు ప్రాంతాల్లో 27 బైకులు దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి 27 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ పంపిణీ కార్యక్రమం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని లబ్ధిదారులకు సహకరించాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు పిలుపునిచ్చారు. అలాగే కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను మై టీడీపీ యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు.
GNTR: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ‘జనవాణి’ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినిపించారు. రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ బేతపూడి విజయ్ శేఖర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
VZM: సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా పోలీసు శాఖకు డ్రోన్‌ను హీరా ఎలక్ట్రో స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ జిల్లా ఎస్పీకి మంగళవారం అందజేశారు. జిల్లా ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ తెలిపారు. జిల్లా పోలీసు శాఖ మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు సంస్థ అందజేయడం అభినందనీయమన్నారు.
KDP: స్నపన తిరుమంజనం వేడుకగా ఒంటిమిట్ట కోదండ రామునికి మంగళవారం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరాముడికి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఈ ఘట్టం స్వామి వారి వేదమంత్రాలు నడుమ అద్భుతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
SKLM: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో గర్భస్థ పూర్వ, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ సలహా మండలి సమావేశం జరిగింది. కలెక్టర్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆడపిల్లల జననాలు తక్కువ నమోదవుతున్న మండలాల్లో స్కానింగ్ సెంటర్లపై మరింత పర్యవేక్షణ చేయాలని అధికారులు ఆదేశించారు.
VSP: సింహాచలం కొత్త గోశాలలో ఏప్రిల్ 1 నుంచి 5 వరకు శబల భోజనాల పండుగ నిర్వహించనున్నట్లు మిల్లెట్స్ రాంబాబు మంగళవారం తెలిపారు. సేవ్ సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ఉచితంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ పండుగను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు వెల్లడించారు.