VSP: విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగం చేస్తున్నవారికోసం సాయంత్రం వేళల్లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది. బీటెక్ పూర్తి చేసి, స్థానికంగా ఉద్యోగం చేస్తున్నవారు ఈ కోర్సుకు అర్హులు. ఏయూ వీసీ రాజశేఖర్ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, కోర్సులో సీటు పొందినవారు ఫీజు చెల్లించాలి. పరీక్షలకు అర్హత సాధించాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి.
E.G: జిల్లాలో మరో ప్రాజెక్ట్‌కు రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. రూ. 94 కోట్లతో చేపడుతున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పూర్తయ్యేలోగా నదిలో హౌస్ బోట్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. రాజమండ్రి పుష్కరాల రేవు, సరస్వతీ ఘాట్, కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో 3 హౌస్ బోట్స్, 4 జలక్రీడల బోట్స్ రానున్నాయి. గోదావరిలో మూడుచోట్ల హౌస్ బోట్ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది.
ATP: ఉరవకొండ పట్టణ శివారులో ఓ ఇంట్లో అక్రమంగా డంప్ చేసిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమవారం రాత్రి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తహసీల్దార్ మహబూబ్ బాషా మాట్లాడుతూ.. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
NLR: సైదాపురం పరిధికి చెందిన ఓ వ్యక్తిని, కేశవరంనకు చెందిన సాయ, కవిత అనేవారు సాప్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ. 8.30 లక్షల నగదు తీసుకుని మోసం చేశారని బాధితులు ఎస్పీ అజితా వేజెండ్లకు వినతి పత్రం అందజేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తన సమస్యను తెలియజేస్తూ, నగదును తీసుకోవడమే గాక తిరిగి తననే బెదిరిస్తున్నారని, న్యాయం చేయాలని బాధితులు కోరారు.
ప్రకాశం: కంభం మండలంలో నిన్న విషాదం నెలకొంది. పెద్ద నల్ల కాలువ గ్రామానికి చెందిన రవిశంకర్, కృష్ణవేణి దంపతుల కుమారుడు యశ్వంత్(12)తో కలిసి పొలానికి వెళ్లారు. కుమారుడిని కాలువ గట్టు మీద కూర్చొపెట్టి తల్లిదండ్రులు పొలం పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో బాలుడికి ఫిట్స్ రావడంతో నీటి కాలువలో పడిపోయాడు. కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
BPT: పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం గ్రామంలో సోమవారం రాత్రి మహిళ మెడలో గొలుసు చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఈ నేరానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందోలు ఎస్సై శివకుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి వేళ జరిగిన ఈ చోరీ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో రామ్‌నగర్ 2వ లైన్‌లో డ్రైనేజ్ సౌకర్యం లేక వర్షం పడితే వరద నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతుందని స్థానికులు తెలిపారు. దీంతో పలు ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.నీరు నిలిచిపోవడంతో పారిశుద్ధ్యం క్షీణించి దోమలు విజృంబిస్తున్నాయని తెలిపారు. అధికారులు ప్రతినిధులు సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
NLR: జిల్లాలో అక్రమ యూరియా, నకిలీ విత్తనాలు ఎరువులు సంబంధించిన సమాచారం ఉంటే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఓ ప్రకటనలు తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, అక్రమ యూరియా నిల్వలు నివారణకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అంతర్గత తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏమైనా సమాచారం ఉన్న 8331057225 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
CTR: ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నికలు ఈనెల 12న నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘ ఎన్నికల అధికారి మురళి తెలిపారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర కమిటీ తరఫున పెంచలయ్య, మల్లేశ్వరరెడ్డి పరిశీలకులుగా వ్యవహరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
కోనసీమ: కొత్తపేట అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఆచంట శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన గతంలో రాజోలు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు ఏపీపీగా, జిల్లా కోర్టు పీపీగా పనిచేశారు. గత ఆగస్టు నెలలో రాజోలు కోర్టు అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ కోర్టు ఏపీపీగా నియమితులయ్యారు. ఈ క్రమంలో హోం మంత్రిత్వ శాఖ కొత్తపేట కోర్టు పీపీగా నియమించారు.
VSP: ఆరిలోవలోని పెదగదిలి జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రైతుబజార్లో అరకొర షాపులు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంత వాసుల కల ఇటీవల రైతు బజార్ ప్రారంభంతో సాకారమైంది. మొత్తం 43 షాపులను ఏర్పాటు చేశారు. అయితే అందులో ప్రస్తుతం కేవలం 10 షాపుల్లో మాత్రమే కూరగాయలు విక్రయిస్తున్నారు. అన్ని రకాల కూరగాయలు అందుబాటులో ఉండడం లేదు.
తిరుపతి: తిరుమలలో మంగళవారం పున్నమి గరుడసేవ జరుగనుంది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 28న గరుడవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు పదిరోజుల వ్యవధిలోనే మరోసారి గరుడునిపై కొలువుదీరి దర్శనమివ్వనున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య ఊరేగింపు జరుగుతుంది.
VZM: విజయనగరం ఉత్సవాల్లో భాగంగా కోట ఎదురుగా బొంకులదిబ్బ వద్ద సోమవారం రాత్రి ప్రదర్శించిన మోహినీ భస్మాసుర నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నాటకాన్ని ప్రేక్షకులు కదలకుండా చూశారు. అంతరించిపోతున్న నాటకాలు పండగ నేపథ్యంలో మళ్ళీ జీవం పోశారని ప్రేక్షకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గనుల శాఖ ఉప సంచాలకులు సిహెచ్ సూర్య చంద్రరావు పర్యవేక్షించారు.
W.G: ఈ నెల 10న భీమవరంలో ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతి ప్రియ ఆధ్వర్యంలో ‘పింఛన్ అదాలత్’ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జేసి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు అన్నారు.