ప్రకాశం: కొమరోలు మండలంలోని రావురిపాలెం, రెడ్డి చర్ల గ్రామాలలో గల పంటలను ఉద్యాన శాఖ అధికారి శ్వేత బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని టమాటా పంటను ఆమె పరిశీలించి, పంటలో మంచి దిగుబడి రావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.