• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పెదవడ్లపూడిలో బైక్ దగ్ధం

GNTR: పెదవడ్లపూడికి చెందిన వీరయ్య బైక్ దగ్ధమైంది. గత రాత్రి ఇంటి ముందు ఆపిన బైక్ ఉదయానికి కాలి బూడిదైనట్లు ఆయన తెలిపాడు. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో అసలు కారణం తెలియరాలేదన్నారు.

April 6, 2026 / 07:17 AM IST

బాలికపై లైంగిక దాడి..!

NTR: పాయికాపురంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై స్థానిక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలికకు కడుపునొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించగా గర్భం దాల్చినట్లు తేలింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

April 6, 2026 / 07:16 AM IST

నేడు అమలాపురంలో జాబ్ మేళా

కోనసీమ: అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన వారు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

April 6, 2026 / 07:12 AM IST

ప్రారంభం కాని నాతవరం పోలీస్ భవనం

అనకాపల్లి: నాతవరం పోలీస్ స్టేషన్ కొత్త భవనం నిర్మాణం పూర్తై రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ చివరి నిమిషంలో కార్యక్రమం రద్దైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రారంభంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

April 6, 2026 / 07:10 AM IST

నేడు అక్రమ చొరబట్లపై మత్స్యకారుల సమావేశం

ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో మత్స్యకారుల సమావేశం ఇవాళ జరగనుంది. తమిళనాడుకు చెందిన జాలర్లు అక్రమంగా తమ సముద్ర ప్రాంతాల్లోకి ప్రవేశించి మరబోట్లతో తమ వలలు, బోట్లకు నష్టం చేస్తున్నారన్న సమస్యపై చర్చించనున్నారు. తిరుపతి, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన మత్స్యకారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

April 6, 2026 / 07:09 AM IST

తిరుమల కళ్యాణకట్ట గురించి తెలుసా ?

తిరుపతి: తిరుమలలో తలనీలాలు సమర్పించే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అని పిలుస్తారు. దాదాపు 1200 మంది క్షురకులతో కళ్యాణకట్టలో 24 గంటల పాటు భక్తులు తలనీలాలు సమర్పించేలా TTD ఏర్పాట్లు చేసింది. అందుకే పాపాల మూటను తొలగించే స్వామిగా శ్రీవారు కలియుగంలో అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. నిత్యం ఏడు కొండలపై పేద, ధనిక బేధం లేకుండా తలనీలాలు సమర్పించే భక్తులతో కళ్యాణకట్ట కిటకిటలాడు

April 6, 2026 / 07:07 AM IST

నేడు జిల్లా వ్యాప్తంగా ‘PGRS’ కార్యక్రమం

ELR: జిల్లా వ్యాప్తంగా ఇవాళ పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌ను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని డివిజన్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. ప్రజలు నేరుగా రావడమే కాకుండా, ‘మీకోసం’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

April 6, 2026 / 07:04 AM IST

నలుగురు విద్యుత్ ఆపరేటర్ల తొలగింపు

NDL: రుద్రవరం మండలం విద్యుత్ సబ్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఆపరేటర్లను ఉన్నతాధికారులు తొలగించినట్లు AE రాజశేఖర్ నిన్న తెలిపారు. ఎల్లావత్తుల సబ్ స్టేషన్ నుంచి హరి, చిన్నకంబలూరు నుంచి పెద్దిరెడ్డి, ఆలమూరు నుంచి నరసింహనాయక్, హరినగరం నుంచి ఆంజనేయులు అనే ఆపరేటర్లను తొలగించినట్లు తెలిపారు. వారంతా నకిలీ ధ్రువపత్రాలతో విధుల్లో చేరినట్లు వెల్లడించారు.

April 6, 2026 / 07:02 AM IST

క్రికెట్ మ్యాచ్‌లో గొడవ.. యువకుడి హత్య

విశాఖ: పెద్దగదిలిలో క్రికెట్ ఆడుతుండగా ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం డోల అజిత్ (23) అనే యువకుడు మరి కొంతమంది క్రికెట్ ఆడుతుండగా కిషోర్ (26) అనే వ్యక్తితో గొడవ జరిగింది. ఆగ్రహించిన కిషోర్ మ్యాచ్ అయిపోయిన అనంతరం పెద్ద గదిలి జంక్షన్లో అందరూ చూస్తుండగా చాకుతో పొడిచి అజిత్‌ను హత్య చేశాడు.

April 6, 2026 / 07:02 AM IST

రెండు కిలోల గంజాయి పట్టివేత

SKLM: ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ పరిధిలో ఎస్సై ఆర్. జనార్దనరావు తన సిబ్బందితో ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు అనుమానస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి నుండి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గంజాయి నిల్వ, రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

April 6, 2026 / 07:00 AM IST

రోడ్డు లేక గ్రామస్తుల అవస్థలు

ASR: అనంతగిరి మండలంలోని కాకరపాడు పీవీటీజీ గ్రామానికి బీటీ రోడ్డు పనులు ఏళ్లుగా నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో మట్టి రోడ్డు దెబ్బతిని రాళ్లు తేలడంతో రాకపోకలు కష్టమయ్యాయి. అంబులెన్స్‌ సహా వాహనాలు గ్రామానికి చేరలేని పరిస్థితి ఏర్పడింది. తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

April 6, 2026 / 07:00 AM IST

నేడు యథావిధిగా ‘PGRS’ కార్యక్రమం: కలెక్టర్

W.G: భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో ఇవాళ ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. దూరప్రాంతాల వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

April 6, 2026 / 07:00 AM IST

224 కేసులు.. రూ.46,660 జరిమానా

KDP: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 224 మందిపై కేసులు నమోదు చేసి రూ.46,660 జరిమానా విధించారు. శిరస్త్రాణం లేకుండా, సీటు బెల్టు ధరిం చకుండా, పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.

April 6, 2026 / 07:00 AM IST

నెల్లూరులో సచివాలయ ఉద్యోగులకు నోటీసులు

NLR: కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఏడుగురు సచివాలయ కార్యదర్శులకు కమిషనర్ నందన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సచివాలయాల్లో సిబ్బంది లేకుండా లైట్లు, ఫ్యాన్లు వేసి ఉన్నారని స్థానికులు ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ సచివాలయ కార్యదర్శులకు ఆదివారం నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.

April 6, 2026 / 06:53 AM IST

ఆగష్టు నెలాఖరుకి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తాం – మంత్రి

VZM: ఆగస్ట్‌ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి కె.నారాయణ తెలిపారు. ఆదివారం బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణ పేదల కోసం అధునాతన టెక్నాలజీతో టిడ్కో ఇళ్లను మంజూరు చేస్తే గత YCP ప్రభుత్వం రూ.3.60 లక్షల ఇళ్లను రద్దుచేసి మిగిలిన ఇళ్లను పూర్తి చేయలేదని విమర్శించారు.

April 6, 2026 / 06:49 AM IST