VSP: నగర పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రతబాగ్చి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో దువ్వాడ ద్వారకా క్రైమ్ ఎస్సై శ్రీనివాసరావు , ఎస్. సంతోష్‌కుమార్ (త్రీటౌన్ ), సిరిపురపు రాజు (ద్వారకా క్రైమ్ త్రీటౌన్), జే. ధర్మేంధ్ర ద్వారకా (దువ్వాడ) ఉన్నారు.
ATP: గుడిపల్లి రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. పది రోజుల్లోగా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే భారీ ధర్నాకు దిగుతామని స్పష్టం చేశారు. అలాగే, RDT స్వచ్ఛంద సంస్థకు నెల రోజుల్లో FCRA రెన్యూవల్ చేయకపోతే, 35 కిలోమీటర్ల మేర మానవహారం చేపడతామని ప్రకటించారు.
SKLM: రణస్థలం పోలీస్ స్టేషన్ పరిధిలో కళాశాలలు, ప్రధాన జంక్షన్‌లలో విద్యార్థులను వేధిస్తున్న యువకుల పై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. ట్రైనీ ఎస్సై మౌనిక నేతృత్వంలోని శక్తి టీం అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.ఈ మేరకు ఎస్సై చిరంజీవి వారికి కౌన్సిలింగ్ చేసి,యువత భవిష్యత్తు పాడుచేసుకోవద్దు అని అన్నారు.
CTR: గుడిపల్లి మండలం కోడిగానిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గది పైకప్పు పెచ్చులూడి విద్యార్థులపై పడడంతో ఏడు మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఒక విద్యార్థిని తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. విద్యార్థి తలకు ఐదు కుట్లు పడినట్లు సమాచారం. ఈ ఘటనపై గుడిపల్లి MEO సైతం పాఠశాలలో విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది.
GNTR: నేడు దుగ్గిరాల మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ గోపి తెలిపారు. దుగ్గిరాలలోని 33/11 KV సబ్ స్టేషన్ పరిధిలో పీరియాడికల్ మెయింటెనెన్స్ కోసం గ్రామాల్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆయా ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు.
ELR: ఏలూరు ఆర్డీఓ అంబరీష్ శుక్రవారం ఉంగుటూరు రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఆయన కొనుగోలు చేసిన ధాన్యం సంచులను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటివరకు ఎంతమంది రైతుల నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేశారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆవరణలో ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి, రైతుల సమస్యలపై మాట్లాడారు.
ELR: మండవల్లి జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం జరిగిన ప్యానల్ ఇన్సపేక్షన్ సందర్భంగా డీవైఈఓ రవీంద్రభారతి పాల్గొన్నారు. విద్యార్థులకు, ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ఆవశ్యకతను ఆమె ఉపాధ్యాయులకు వివరించారు. చుట్టుపక్కల పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు తమ బోధనా పద్ధతులను ఆమెకు వివరించారు.
PLD: అమరావతిలోని శ్రీఅమరేశ్వరస్వామి దేవాలయంలో శనివారం హుండీలు లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి రేఖ ఒక ప్రకటనలో తెలిపారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నతాధికారులు సమక్షంలో ఆలయంలో ఉన్న హుండీలు లెక్కింపు కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తామని మీడియా మిత్రులకు సమాచారాన్ని తెలిపారు.
PLD: ఎస్టీ, ఎస్సీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నామని పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శనివారం ఉదయం 10.30 గంటలకు నరసరావుపేట కలెక్టరేట్‌లో ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు వినియోగించుకుని తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించుకోవాలని కోరారు.
ATP: మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి రాప్తాడుకు చేరుకుంటారు. వైసీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె మోక్షిత వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి తిరిగి బెంగళూరుకు వెళ్లనున్నారు.
SKLM: ప్రభుత్వ పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. జిల్లాలో లక్షా 60 వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం రాత్రి స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో మత్స్యకారు దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మత్స్య శాఖ స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు.
TPT: తిరుచానూరులో పంచమి తీర్థం సందర్భంగా భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పుష్కరిణి ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిఘా, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ చేపట్టారు. 2వేల మంది సిబ్బందితో బందోబస్తు, లైఫ్ గార్డులు, SDRF, డైవర్స్ నియామకం చేశారు.
SKLM: ఎచ్చెర్ల మాజీ ఎంపీపీ మొదల వలస చిరంజీవి శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. గత నెల 15న పీడీ యాక్ట్ పై అరెస్ట్ అయ్యారు. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.హైకోర్టు పీడీ యాక్ట్ కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది అని స్థానిక ఎస్ఐ చిరంజీవి తెలిపారు.
W.G: ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా 33/11 కేవీ చినకాపవరం విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో ఈనెల 22 శనివారం ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. పెదకాపవరం, చినకాపవరం, మహాలక్ష్మిపురం, రామాయగూడెం, క్షత్రియపురం, తరటావా, గుమ్ములూరు, అరేడు, క్రొవ్విడి, పాములపర్రు గ్రామాల్లోని ఆక్వా చెరువుల లైన్లలో కరెంటు సరఫరా ఉండదన్నారు.