CTR: పుంగనూరు మండలంలోని గ్రామదేవతల ఆలయాల్లో శుక్రవారం రాహుకాల పూజలు జరిగాయి. తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం, బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాళ్యం శ్రీ తాటిమాను గంగమ్మ ఇలా పట్టణంలో పాటు గ్రామాల్లోను అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
PPM: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే తన ఎజెండా అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వినతుల రూపంలో అందించిన సమస్యలను పరిశీలించి వాటిలో పలు సమస్యలను వెంటనే పరిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి సమస్యను తక్షణ పురిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ATP: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నివాళులర్పించారు. మహిళా విద్యాభివృద్ధికి పూలే చేసిన సేవలను స్మరించారు. జగన్ హయాంలోనే బీసీలకు సామాజిక న్యాయం జరిగిందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో కూటమి ప్రభుత్వం పూలే ఆశయాలకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు.
NLR: నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడు కోటంరెడ్డి విజయకుమార్ రెడ్డి కుమార్తె హరిణ్య -రాహుల్ సిప్లిగంజ్ వివాహ రిసెప్షన్ కు MLA సోమిరెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులతో పాటు వేం నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. వారంతా నూతన వధూవరులను ఆశీర్వదించారు.
VSP: బురుజుపేటలో వేంచిసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిరమాసం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే దర్శనానికి వచ్చే భక్తుల తమకు ఎదురవుతున్న ఇబ్బందులు తెలిపారు. రూ.500, రూ.200, రూ.100, ఫ్రీ దర్శనం ఒకే చోట కలపడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు చెప్పగా.. ఎగ్జిట్ దారి మార్చడం వలన సీనియర్ సిటజన్స్ అవస్థలు పడుతున్నారని పలువురు వాపోతున్నారు.
NDL: బనగానపల్లెని నూతన రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు శుక్రవారం జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి తెలిపారు. ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా కలెక్టర్ కార్యాలయానికి లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. గెజిట్‌ను గ్రామ సచివాలయాలు, మండల కార్యాలయాలు, డివిజన్ కేంద్రాల్లో ప్రచురిస్తామన్నారు.
KDP: పులివెందులలో సమాజ సేవకుడు జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మున్సిపల్ ఇంఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ఫూలే సమాజంలో అన్యాయాలు, కుల వివక్షను రూపుమాపడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.
ప్రకాశం: లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైసీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు పరామర్శించారు. చెవిరెడ్డి ఆరోగ్య పరిస్థితులు గురించి అడిగి తెలుసుకున్నారు. చెవిరెడ్డిని కలిసిన వారిలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, కనిగిరి ఇంఛార్జ్ దద్దాల నారాయణ ఉన్నారు.
NTR: దోమల నివారణకు వాడే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకరమైన మేపర్‌ఫ్లూథ్రిన్ అనే పురుగుమందు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల విజయవాడలోని ఒక షాపులో తనిఖీలు చేసి సేకరించిన నమూనాలను హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్‌కు పంపగా ఈ అగరబత్తీల్లో ప్రాణాంతక రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
PPM: ఉద్యోగుల, పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయాలని జేసీ సి. యస్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్స్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి పలువురు ఉద్యోగుల, పెన్షనర్స్ నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు.
NLR: ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త మేరిగ మురళీ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్లో చికిత్స అంతరం మాగుంట లేఔట్ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ప్రసన్న ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ATP: వడ్డే కాలనీకి చెందిన చంద్రకళ కుటుంబానికి మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. బాధితురాలి సమస్యను జగన్ మోహన్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి, ఎన్ఆర్ఐల సహకారంతో సేకరించిన రూ. 2,20,000 ఆర్థిక సహాయాన్ని ఈరోజు బాధితురాలి కుటుంబానికి అందజేశారు. కోలుకునే వరకు అండగా ఉంటామని రంగయ్య హామీ ఇచ్చారు.
NTR: నందిగామ వంద పడకల ఆసుపత్రి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇవాళ పరిశీలించారు. కూటమి నేతలు, అధికారులు సమక్షంలో పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఆమె నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆసుపత్రి ఆధునిక సదుపాయాలతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తుందని తెలిపారు.
ప్రకాశం: ఎర్రగొండపాలెంలోని పాత రిజిస్టర్ కార్యాలయం వీధిలో శుక్రవారం సైడ్ కాలువల నిర్మాణానికి టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని, కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఆయన తెలిపారు. సమస్యను పరిష్కరించినందుకు స్థానికులు ఎరిక్షన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
NDL: రైతు అభివృద్ధి, సంక్షేమే ఉమ్మడి కూటమి యొక్క లక్ష్యం అని ఎమ్మెల్య గిత్త జయసూర్య అన్నారు. పగిడ్యాల మండల కేంద్రంలో శుక్రవారం రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి రైతన్న ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును వివరిస్తూ, అవగాహన కల్పించారు. అలాగే సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు