కృష్ణా: గుడివాడ మాంటిసోరి హై స్కూల్‌లో బాలోత్సవాలు, బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు సనకా సుబ్బారావు అధ్యక్షతన ఈరోజు ప్రారంభమయ్యాయి.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సివిల్ జడ్జ్ గాయత్రి పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించి, మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
విశాఖపట్నం విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం చేరుకున్నారు. అధికార నాయకులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. పర్యటనలో పలు సమీక్షలు, సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. నగరంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
KDP: బద్వేల్‌లో ఆగస్ట్ 9న గోల్డ్-సిల్వర్ షాప్‌లో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. నవంబర్ 29 ఉదయం వాహన తనిఖీల్లో నెల్లూరు రోడ్డుపై నిందితుడు దాస్ శ్రీరాంను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 72 గ్రాముల బంగారం, దాదాపు 5 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేశారు. ఫింగర్‌ప్రింట్లు, సీసీ కెమెరా ఆధారాలను విశ్లేషించిన సీఐ టీం గుర్తించి పట్టుకుంది.
అన్నమయ్య: నకిలీ మద్యం కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని తంబళ్లపల్లె(M) కన్నెమడుగుకు చెందిన రామకృష్ణ రెడ్డి, రవిశంకర్ రెడ్డి (బాబు బ్రదర్స్) స్పష్టం చేశారు. కేసులకు భయపడి తాము పారిపోయామంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు దుష్ప్రచారాలని వారు అన్నారు. తప్పు చేసినవారే పరారీలో ఉన్నారని, తాము కన్నెమడుగులోనే ఉన్నామని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని వారు తెలిపారు.
కృష్ణా: సామాజిక బాధ్యతగా ప్రతి శనివారం సైకిల్ లేదా నడక ద్వారా కార్యాలయానికి రావాలని ఉద్యోగులకు ఇచ్చిన పిలుపుకు కలెక్టర్ బాలాజీ స్వయంగా ఆదర్శంగా నిలిచారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కలెక్టర్ బాలాజీ యథావిధిగా సైకిల్‌పై ప్రయాణించి మచిలీపట్నంలోని కలెక్టరేట్‌కు చేరుకుని విధులకు హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య పరిరక్షణ, ఇంధన పొదుపు చేయాలని పిలుపునిచ్చారు.
GNTR: కాకుమాను మండలం కొండపాటూరులో తహశీల్దార్ బి.వెంకటస్వామి, ఏవో సుధాకర్ శనివారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జీవో నం.740 ప్రకారం నల్ల బార్లీ పొగాకు సాగు నిషేధమని, రబీ సీజన్‌లో దీనికి ప్రభుత్వం ‘క్రాప్ హాలిడే’ ప్రకటించిందని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం పాండ్రాపాడులో ధాన్యం తేమ శాతం పరిశీలించి, వెంటనే ట్రక్ షీట్లను జనరేట్ చేశారు.
VZM: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ తర్లాడ రాజశేఖర్ రావు శనివారం విజయనగరానికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో రాజశేఖర్‌ను కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
ELR: నూజివీడు మండలంలోని అన్నవరం జడ్పీ హైస్కూల్‌ను డివైఈవో సుధాకర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం చదివి అత్యుత్తమ ప్రగతి సాధించాలన్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించి 100% ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలన్నారు. ఇందులో హెచ్ఎం విజయ కుమారి, పీడీ రవీంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
PPM: ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే చెల్లింపులు చేయటాన్ని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర అన్నారు. శనివారం పార్వతీపురం మండలం పెదబోండపల్లిలో రైతులతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20000 విత్తనాలు ఎరువులు అందిస్తున్నామన్నారు.
KDP: కడప నగర శివారులోని ఆచారి నగర్‌లో పేదలకు కేటాయించిన స్థలాలను ధనవంతులు ఆక్రమించుకున్నారని RCP రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆ ప్రాంతాన్ని సందర్శించి, పుట్లంపల్లి చెరువులో ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల అవి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. అధికారుల సహకారంతో కొందరు వ్యక్తులు 3-4 స్థలాలను ఆక్రమించుకున్నారన్నారు.
KDP: కడప నగరంలో గంజాయి, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం వన్ టౌన్ పరిధిలోని పాత బస్టాండ్, బుగ్గవంక, గుర్రాల గడ్డ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. డ్రోన్ల ద్వారా పారిపోతున్న నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శనీశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జాము నుంచి స్వామివారికి తైలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు భక్తులు సమర్పించిన విరాళాలు వివిధ సేవలు ద్వారా రూ. 2.24లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈఓ సురేష్ బాబు తెలిపారు
KDP: పులివెందులలోని ఇస్లాంపురానికి చెందిన నూలేబాషా శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు కుటుంబ కలహాలతో ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సత్యసాయి: హిందూపురంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సత్యం డయాగ్నసిస్ సెంటర్‌ను వైద్యాధికారి పద్మజ, ఎంపీహెచ్‌ఈవో మల్లన్న శనివారం పరిశీలించి క్లోజ్ చేశారు. సెంటర్‌లో అర్హత లేని వారు రక్తపరీక్షలు చేస్తున్నారని, కాలం చెల్లిన రసాయనాలు వినియోగిస్తున్నారని, గ్లౌజులు వాడకుండా పరీక్షలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతో సెంటర్‌ను క్లోజ్ చేశారు.
ప్రకాశం: ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ సమీపంలో ఉన్న మున్సిపల్ హైస్కూల్‌లో శనివారం దివ్యాంగులకు పలు క్రీడా పోటీలను నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ జెండా ఊపి ప్రారంభించారు. విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో డీఈవో కిరణ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.