NLR: బుచ్చిరెడ్డిపాళెం పురపాలక పరిధిలో అక్రమ కుళాయి కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. పట్టణ వ్యాప్తంగా 9,632 గృహాలు ఉండగా 4,201 కుళాయిలు కనెక్షన్లు ఉన్నాయి. అక్రమ కనెక్షన్లు ఉన్నాయని అధికారుల సర్వేలో తేటతెల్లమైంది. ప్రత్యేక డ్రైవ్లో వాటిని గుర్తించామని క్రమబద్ధీకరించేలా చర్యలు చేపడతామని నగర కమిషనర్ బాలకృష్ణ వెల్లడించారు.