కోనసీమ: ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జరుగుతున్న అరిగెల శ్రీ రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను రాత్రి అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి తిలకించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ టీమ్ క్రీడాకారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఈ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు. జిల్లాలో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందేలా కృషి చేస్తానని ఎంపీ తెలిపారు.