కోనసీమ: మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో దేవుడు కాలనీ నందు జరుగుచున్న సీసీ రోడ్లు, డైన్ పనులను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శనివారం పరిశీలించారు. దేవుడు కాలనీలో పనులు జరుగుచున్న ప్రతీచోట తిరిగి డ్రైన్స్ లెవిలింగ్ను పరిశీలించారు. నాణ్యత లోపం లేకుండా పనులు త్వరగా పూర్తిచెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.