GNTR: పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అంకమ్మతల్లి దేవాలయం సమీపంలోని అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట కేంద్రాన్ని పోలీసులు ఛేదించారు. రెండో అంతస్తులో జూదం ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 45,000 నగదుతో పాటు 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.