ASR: అనంతగిరి మండలంలోని కాకరపాడు పీవీటీజీ గ్రామానికి బీటీ రోడ్డు పనులు ఏళ్లుగా నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో మట్టి రోడ్డు దెబ్బతిని రాళ్లు తేలడంతో రాకపోకలు కష్టమయ్యాయి. అంబులెన్స్ సహా వాహనాలు గ్రామానికి చేరలేని పరిస్థితి ఏర్పడింది. తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.