KRNL: ఆదోని పట్టణంలో సాయి జ్యోతి నేత్రదాన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని పండిట్ నెహ్రూ గౌడ రాజగోపాల్ భవనం ముందు ఆదివారం ఉదయం ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. గత 10 సంవత్సరాలుగా ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు శ్రీధర్, విశ్వనాథ్, బీజేపీ నాయకులు మరియాని చెన్నబసప్ప తెలిపారు.