CTR: సదుం మండలంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పర్యటించారు. పొట్టెంవారిపల్లి చీకల చేను గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలలో నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. చీకలచేనులో గాయపడ్డ పార్టీ నాయకుడు రామ్మూర్తిని పరామర్శించారు.
GNTR: రేపు ఉండవల్లి నుంచి తుళ్ళూరు మండలం రాయపూడి వరకు CPM బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రాజధాని ప్రాంత CPM నాయకులు ఎం.రవి మంగళవారం తెలిపారు. ఉండవల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతి వస్తున్న సందర్భంగా అమరావతి ప్రాంత సమస్యలు ఆమె దృష్టికి తీసుకువెళ్లేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రకాశం: కనిగిరి అటవీ రేంజ్ పామూరు సెక్షన్ కోడిగుంపల బీట్‌లో గల నానాజాతి మొక్కల ప్లాంటేషన్‌ను మంగళవారం గుంటూరు సర్కిల్ అటవీ సంరక్షణ అధికారి ఐకేవీ రాజు పరిశీలించారు. ప్లాంటేషన్ తదుపరి పనులను చేయాలని ఆదేశించారు. కనిగిరి నగర వన అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు. జిల్లాలో పులుల గణన వెంటనే చేపట్టాలని డీఎఫ్‌వో కే. వినోద్‌ను ఆదేశించారు.
కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో పోలీసులు ‘మహిళా భద్రత’పై విస్తృత అవగాహన కల్పించారు. పోక్సో చట్టం, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా మోసాలు, బాల్యవివాహాల నష్టాలపై విద్యార్థులను చైతన్యం చేశారు. ఆపదలో డయల్ 100,112,1098, 181,1930 నెంబర్లను వినియోగించుకోవాలని వారు సూచించారు.
E.G: వచ్చే ఏడాది 2027 జూలై 23న రాజమండ్రి గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు అయినట్లు జిల్లా అధికార వర్గాలు మంగళవారం తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం రూ.100 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 23 వరకు పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కోసం రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు రూ. 271.43 కోట్లు కేటాయించినట్లు తాజాగా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
NDL: రాష్ట్రంలో రైతులను అన్ని విధాల ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బుడ్డా పేర్కొన్నారు. మంగళవారం వెలుగోడు మండలం అబ్దుల్లాపురంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అధికారులతో కలిసి ఇంటింటికీ తిరిగారు. రైతుల కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ఆధారిత పంటల సాగు,అగ్రిటెక్,ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు.
SKLM: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఇచ్చాపురం MLA ప్రభుత్వ విప్ అశోక్ బాబు అన్నారు. ఇవాళ ఇచ్చాపురం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఉపాధ్యాయులు చూపుతున్న సేవ అభినందనీయమని అన్నారు.
CTR: చిత్తూరు నగరంలో చేపడుతున్న రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా అత్యంత కీలకమైన పలమనేరు రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం దర్గా సర్కిల్ నుండి ఇరువారం వరకు 100 అడుగుల మేర రోడ్డును విస్తరించి పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
W.G: అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం తాడేపల్లిగూడెం వీకర్స్ కాలనీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ రవికుమార్ మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళలను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో టీఎల్ సరస్వతి పాల్గొన్నారు.
ప్రకాశం: పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామంలో సర్పంచ్ గుడ్డెపోగు రమేష్ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ వారు మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు 160 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగినదని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
NDL: కేంద్ర న్యాయశాఖ లేఖకు అనుగుణంగా హైకోర్టు న్యాయమూర్తులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యుటీ పరిమితిని పెంచినట్లు మంగళవారం న్యాయశాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 2024 జనవరి 1 నుంచి గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచినట్లు మంత్రి ఫరూక్ వెల్లడించారు.
ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో ‘రైతన్న-మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. రైతులంతా ఒకేసారి ఒకే రకం పంటలు సాగు చేసి నష్టపోవద్దని ఆమె సూచించారు. పంటలు తక్కువగా ఉన్నప్పుడే ధరలు బాగుంటాయని, ఈ విషయంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖకు చెందిన శక్తి టీమ్ బృందాలు పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మంగళవారం శక్తి టీమ్ సభ్యులు శక్తి యాప్, సైబర్ నేరాలు, పోక్సో చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బాలికలకు, మహిళలకు చట్టపరమైన సమాచారం అందించారు.
E.G: గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్న రాంబాబు, హెల్పర్ అర్జున్‌కు జనసేన పార్టీ నాయకులు నవ వాసి విష్ణు ఆధ్వర్యంలో హ్యాండ్ గ్లౌజులు మంగళవారం అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడినప్పుడు గ్లౌజులు వాడడంతో ప్రమాదాలు జరగకుండా ఉంటుందని జనసేన నాయకులు తెలిపారు.
NDL: రాష్ట్రంలో ఉన్న మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండి నడిపించాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. మంగళవారం నందికొట్కూరు పట్టణంలో ఏబీవీపీ కార్యకర్తలు ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రతి మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.