KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తామని TTD JEO వీరబ్రహ్మం అన్నారు. రామయ్య క్షేత్రం కళ్యాణ వేదికలో క్యూలైన్ల, భారీ కేడ్లు, గ్యాలరీలు, అన్న ప్రసాదం తయారీ కేంద్రం, విశ్రాంతి భవనం, మాడవీధులు, కాలిబాటల్లో చేపట్టిన ఏర్పాట్లను ముఖ్య భద్రత, నిఘా అధికారి మురళీకృష్ణ, SP విశ్వనాథ్‌తో కలిసి బుధవారం పరిశీలించారు.