PPM: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మహిళా మార్ట్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీకి వినూత్న డెలివరీ వ్యవస్థ తీసుకురావాలని, ప్రతి 10-15 గ్రామాలకు ఒక FPO ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ‘మన్యం బ్లింకిట్’ తరహాలో గ్రామీణ డెలివరీ సేవలు ప్రారంభించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు.