PPM: వృత్తిపరమైన బాధ్యతలతో నిత్యం ఒత్తిడితో పనిచేసే ఉద్యోగులకు క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్తేజం లభిస్తుందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. జాతీయ సర్వే దినోత్సవం పురస్కరించుకుని మండలంలోని వెంకంపేట గ్రామంలో బుధవారం ఘనంగా క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై, క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు.