KRNL: కర్నూలు కొత్తపేటలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సోమవారం 112 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదుల్లో మోసాలు, బెదిరింపులు, డబ్బుల దుర్వినియోగం వంటి ఫిర్యాదులు అందాయి. బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఎస్పీ, అన్ని వినతులపై చట్టపరంగా విచారణ జరిపి త్వరితగతిన న్యాయం చేస్తామని పేర్కొన్నారు.