GNTR: గుంటూరు నగరపాలక సంస్థ వార్డుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 57 వార్డులు ఉండేవి. తాజా ఉత్తర్వులతో వీటి సంఖ్య 76కు చేరింది. అంటే ఏకంగా కొత్తగా 19 వార్డులు పెరిగాయి. మున్సిపల్ చట్టాల సవరణ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెరిగిన వార్డుల సంఖ్యకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు.