కోనసీమ: అణగారిన వర్గాల విద్యా సాధికారత, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ధీశాలి మహాత్మా జ్యోతిరావు పూలే అని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కొనియాడారు. శనివారం అమలాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.