అన్నమయ్య: ములకలచెరువు ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో సోమవారం రాత్రి కూలీ డబ్బుల కోసం వేచి ఉన్న రమేష్ (32) అనే యువకుడిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్ కాలు విరిగి తీవ్రంగా గాయపడగా, కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు 108 వాహనంలో అతడిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, పరారైన కారు కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.