CTR: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కేంద్ర మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సయానీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఏఈవో రవీంద్రబాబు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ పాల్గొన్నారు.