TTD: ఛైర్మన్ బీ.ఆర్.నాయుడును ఈవో ముద్దాడ రవిచంద్ర గురువారం సాయంత్రం తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఛైర్మన్‌తో పాటు బోర్డు సభ్యులు నరేష్ కుమార్ ఉన్నారు.