BPT: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే, గ్రౌండు ట్రూతింగు, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ రాష్ట్ర డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కారంచేడు, ఇంకొల్లులో జరుగుతున్న గ్రౌండు ట్రూతింగు పనులను, బాపట్ల (మం) చెరువు గ్రామంలో విలేజ్ సర్వేయర్ లాగిన్ ద్వారా సాగుతున్న పనులను ఆయన పరిశీలించారు.