SKLM: విద్యార్థుల్లో పరిశోధనా జిజ్ఞాసను పెంపొందించేలా పాఠశాల యాజమాన్యాలు కృషి చేయాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ స్కూల్లో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 500 మంది విద్యార్థులు రూపొందించిన 175 వినూత్న ప్రాజెక్టులను ఆయన పరిశీలించి, విద్యార్థుల మేధోసంపత్తిని అభినందించారు.