KMR: భిక్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ ఏమిమా పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. గర్భిణీలు కచ్చితంగా పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. అలాగే, రక్తహీనత తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గర్భిణీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.