MNCL: ఇందిరమ్మ ఇళ్లు పథకంతో పేదవారి సొంతింటి కల సాకారమవుతోందని మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. సోమవారం 29వ డివిజన్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారు గృహ ప్రవేశాన్ని డిప్యూటీ మేయర్ సల్ల రమ్యతో కలిసి ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.