NRPT: రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రతి గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని మరికల్ సీఐ భగవంతు రెడ్డి తెలిపారు. సోమవారం గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో అరైవ్ అలైవ్లో భాగంగా రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసి వాహనదారులకు ప్రమాద నివారణలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సై మహేశ్వరి, సర్పంచ్ చెన్నయ్య ఉన్నారు.