TG: వచ్చే ఎన్నికల్లో BRS, BJP కలిసి పోటీ చేసినా అధికారం కాంగ్రెస్‌దేనని టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. BRSను మళ్లీ TRSగా మార్చినా, లేదా BJPతో కలిపి BJRSగా మార్చినా ఆ పార్టీలు మళ్లీ కోలుకోలేవని ఎద్దేవా చేశారు. సింగరేణి ఒప్పందాలన్నీ గత BRS హయాంలో జరిగినవేనని గుర్తు చేస్తూనే, కేటీఆర్ పాదయాత్ర చేస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు.