SRPT: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్డీవో వేణు మాధవరావు, మున్సిపల్ ఛైర్మన్ రఘునందన్ రెడ్డి తెలిపారు. సోమవారం తిరుమలగిరిలోని మున్సిపల్ కార్యాలయంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.