NLG: ఈనెల 19న జరిగే పూలే-అంబేద్కర్ జన జాతరను విజయవంతం చేయాలని KVPS జిల్లా ఉపాధ్యక్షుడు గాదే నరసింహ పిలుపునిచ్చారు. నల్లగొండ పట్టణంలోని పెద్ద బండ సెంటర్లో జన జాతర కరపత్రాలను ఆవిష్కరించారు. మహనీయుల ఆశయ సాధన కోసం KVPS నిరంతరం కృషి చేస్తుందని, కుల వివక్ష, అంటరాని తనాన్ని నిర్మూలించి మనుషులంతా సమానం అనే భావనను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.