KMR: అగ్ని ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్ అన్నారు. సోమవారం ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి 20 వరకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘సేఫ్ స్కూల్, సేఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ’ అనే అంశాలపై ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.