NLG: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సాంఘిక శాస్త్రం పరీక్ష జిల్లావ్యాప్తంగా 106 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసింది. 19,698 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 19,661 (99.84%) మంది హాజరుకాగా, 13 మంది ప్రైవేట్ విద్యార్థులలో 12 మంది పరీక్ష రాశారు. మొత్తం 38 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు.